Dimple Hayathi: ‘సామాన్యుడు’, ‘ఖిలాడీ’ ఇద్దరూ కాపాడలేకపోయారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటిగా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలో తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించింది డింపుల్ హయతీ. విజయవాడలో పుట్టి హైదరాబాద్ లో పెరిగిన డింపుల్ కు ఈ యేడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ నెలలో ఆమె సినిమాలు ‘సామాన్యుడు’, ‘ఖిలాడీ’ బ్యాక్ టూ బ్యాక్ విడుదలయ్యాయి. విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ‘సామాన్యుడు’ మూవీ తమిళ, తెలుగు, కన్నడ, మలయళ, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే ఎక్కడా ఈ మూవీకి ఆశించిన స్థాయి సక్సెస్ దక్కలేదు. దేశ వ్యాప్తంగా తన సినిమా విడుదలైందన్న తృప్తి తప్పితే డింపుల్ కు ఇంకేమీ దక్కలేదు.
ఇక గత శుక్రవారం వచ్చిన ‘ఖిలాడీ’ కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా కూడా తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలైంది. గత యేడాది డిసెంబర్ 24న డింపుల్ నటించిన డైరెక్ట్ హిందీ సినిమా ‘అత్రంగీ రే’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ రకంగా వరుసగా మూడు చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైన డింపుల్ హయతీకి మరి బాలీవుడ్ లో ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇదిలా ఉంటే ప్రేమికుల రోజున ఓ వ్యక్తి డింపుల్ ను కాస్తంత కంగారు పెట్టాడు. సెల్ నంబర్ ను ఆమె పేరుతో క్రియేట్ చేసి, హల్చల్ చేయడం డింపుల్ దృష్టిలో పడింది. దానితో సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులందరినీ అలర్ట్ చేసింది. ఆ నంబర్ కు స్పందించవద్దని, అవకాశం ఉంటే దానిని బ్లాక్ చేయడంతో పాటు అతనిపై ఫిర్యాదు చేయమని కోరింది. ఏదేమైనా… అటు ‘సామాన్యుడు’, ఇటు ‘ఖిలాడీ’ ఇద్దరూ ఆమెకు సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయారన్నది వాస్తవం.
Also Read
తాజావార్తలు
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
-
NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Brazil Election 2026: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం.. మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు!
-
Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!