నటిగా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలో తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించింది డింపుల్ హయతీ. విజయవాడలో పుట్టి హైదరాబాద్ లో పెరిగిన డింపుల్ కు ఈ యేడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ నెలలో ఆమె సినిమాలు ‘సామాన్యుడు’, ‘ఖిలాడీ’ బ్యాక్ టూ బ్యాక్ విడుదలయ్యాయి. విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ‘సామాన్యుడు’ మూవీ తమిళ, తెలుగు, కన్నడ, మలయళ, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే ఎక్కడా ఈ మూవీకి ఆశించిన స్థాయి సక్సెస్…