Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dil Raju To Join Nbk108 As Co Producer

NBK108: నిర్మాణంలో భాగం కానున్న ఆ నిర్మాత..?

Published Date :June 11, 2022 , 10:37 am
By NTV WebDesk
NBK108: నిర్మాణంలో భాగం కానున్న ఆ నిర్మాత..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో NBK108 చేయనున్న సంగతి తెలిసిందే! ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరిపాటి నిర్మిస్తున్న ఈ సినిమా గురించి లేటెస్ట్‌గా ఓ ఆసక్తికరమైన అప్డేట్ తెరమీదకొచ్చింది. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా భాగం కానున్నాడట! దిల్‌రాజు ఇప్పటివరకూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్ని నిర్మించాడు. తాజాగా NBK108కి సహ-నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిసింది. షైన్ స్క్రీన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఇప్పుడీ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. దిల్‌రాజు రాకతో ఈ సినిమా బడ్జెట్ కాస్త పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు, బాలయ్య పుట్టినరోజు సందర్భంగానే NBK108 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ కుదరలేదు. అనిల్ రావిపూడి ఈ చిత్రం కోసం బాలయ్యకు ఓ కొత్త గెటప్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్టుని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. పనిలోపనిగా, నటీనటుల్ని కూడా ఎంపిక చేస్తున్నాడు. ఆల్రెడీ ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీలాని ఫైనల్ చేశారు. కథానాయికతో పాటు కీలక పాత్రల కోసం పేరుగాంచిన నటుల్ని రంగంలోకి దింపుతున్నారు. తండ్రి, కూతురు బంధం నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు అనిల్ తన కామెడీ శైలికి భిన్నంగా ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య 45 ఏళ్ల తండ్రి పాత్రలో కనిపించనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • Balakrishna
  • Dil Raju
  • NBK108
  • SreeLeela

తాజావార్తలు

  • Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..

  • The Paradise: ‘ది ప్యారడైజ్’ రిలీజ్ విషయంలో నాని లెక్క మళ్ళి తప్పుతుందా?

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Artemis 2: 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయిన ఆర్టెమిస్ 2.. కారణమిదే..

  • Astrology: ఏప్రిల్‌ 7, మంగళవారం దినఫలాలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions