తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో, అత్యంత దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఆమెను చేర్చుకోవడానికి ఒక కార్పొరేట్ ఆసుపత్రి నిరాకరించడం కలకలం రేపింది. ఆ తర్వాత ఫుట్‌పాత్‌పై దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన స్థానికులు, పోలీసులు మానవత్వంతో స్పందించి, ఆర్కే ఫౌండేషన్ సహకారంతో కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్‌కు తరలించారు.
తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న పావలా శ్యామలను ప్రసాద్ హాస్పిటల్ వైద్యులు తక్షణమే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అత్యవసర చికిత్స ప్రారంభించారు. ఈ వార్త మీడియా, సోషల్ మీడియా ద్వారా బయటకు రాగానే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తక్షణమే స్పందించారు. శ్యామల ఏ ఆసుపత్రిలో ఉందో తన మేనేజర్ల ద్వారా వెంటనే ట్రేస్ చేయించిన ఆయన, ప్రసాద్ హాస్పిటల్ వైద్యులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పావలా శ్యామల గాల్‌బ్లాడర్ (పిత్తాశయం) తీవ్ర సమస్యతో బాధపడుతున్నారు. దీనికి తోడు ఆమె శరీరంలో అబ్డామినల్ క్రియాటినిన్ స్థాయిలు ప్రమాదకరంగా పెరిగాయని, అలాగే వృద్ధాప్య భారంతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు తల నుంచి పూర్తి స్థాయి స్కాన్‌లు, 2D ECO వంటి పలు కీలక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.
పావలా శ్యామల దయనీయ స్థితిని చూసి చలించిపోయిన నిర్మాత దిల్ రాజు.. ఆమెకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను తానే భరిస్తానని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. శ్యామల ఆరోగ్య విషయంలో ఎలాంటి వెనకడుగు వేయకుండా, అత్యంత మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆసుపత్రి వైద్యులకు విజ్ఞప్తి చేశారు. దిల్ రాజుకు సంబంధించిన మేనేజర్లు నిరంతరం ఆసుపత్రి సిబ్బందితో సంప్రదింపులు జరుపుతూ, శ్యామల పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ఆమెకు అండగా ఉంటారని స్పష్టం చేశారు. కష్టకాలంలో ఒక సీనియర్ నటిని ఆదుకోవడానికి దిల్ రాజు ముందుకు రావడం పట్ల సినీ పరిశ్రమ వర్గాలతో పాటు నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నటి పావలా శ్యామలకు అండగా నిలిచిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను చేర్చుకునేందుకు నిరాకరించిన కార్పొరేట్ ఆసుపత్రి.!
ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో ఉన్న శ్యామలను గమనించి, ఆర్కే ఫౌండేషన్‌కు తరలించిన స్థానికులు, పోలీసులు.
తీవ్ర… pic.twitter.com/TwUVtXpPHX
— NTV Breaking News (@NTVJustIn) May 16, 2026
