NTV Telugu Site icon

SVC Cinemas: స్క్రీన్లు పెంచుకుంటూ వెళ్తున్న దిల్ రాజు..మరో మల్టీప్లెక్స్ లాంచ్

Svc Thumb

Svc Thumb

Dil Raju inagurates SVC Cinemas: ఎగ్జిబిటర్గా సినీ కెరీర్ మొదలు పెట్టి డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఆ తర్వాత దిల్ సినిమా నిర్మించి నిర్మాతగా మారారు దిల్ రాజు. నిర్మాత అయిన తర్వాత కూడా డిస్ట్రిబ్యూషన్ వదలకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో టాప్ ప్రొడ్యూసర్ గా మారిన తరువాత కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి గ్రిప్ సాధించుకున్నాడు.

Kushi : 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి మళ్ళీ ట్రెండింగ్‌లో ‘నా రోజా నువ్వే’

ఎగ్జిబిటర్ గా కూడా ఏమాత్రం పట్టు వదలకుండా నైజాం, వైజాగ్ ప్రాంతాల్లో ఎన్నో థియేటర్స్ ను నేరుగా లేక లీజు పద్దతిలోనో కావాల్సిన సినిమాలు ఆడిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యన సొంతంగా కూడా కొన్ని థియేటర్లను సిద్ధం చేస్తున్న ఆయన తాజాగా గద్వాల జిల్లా కేంద్రంలో ఓ కొత్త మల్టీప్లెక్స్ ను ప్రారంభించబోతున్నారు.

 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ను షార్ట్ ఫామ్ గా మార్చి “ఎస్విసి” అనే తమ బ్యానర్ పేరునే ఈ మల్టీప్లెక్స్ కు కూడా ఫిక్స్ చేసారు. ఇక అందుతున్న సమాచారం మేరకు ఈ మల్టీప్లెక్స్ లో అత్యంత అధునాతనమైన సౌకర్యాలు ఉంటాయని అంటున్నారు.

 

ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం 3 స్క్రీన్స్ ఉంటాయని ఈ మూడింటికి కలిపి మొత్తం 979 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఈ మూడు స్క్రీన్స్ లో రిక్లైనర్ సీట్స్ కూడా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నప్పుడు గద్వాల సాధారణ పట్టణంగానే ఉండేది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాగా మార్చడంతో జిల్లా కేంద్రంలోనే మల్టీప్లెక్స్ నిర్మించారు దిల్ రాజు.