Dilraju : తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల వేడుక నిన్న శనివారం గ్రాండ్ గా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ స్వయంగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంపై తాజాగా నిర్మాత, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి అందరికీ థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మూవీ అవార్డులు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తే కచ్చితంగా వచ్చి స్వీకరించాలన్నారు. ఎంత పెద్ద స్టార్లు అయినా షూటింగ్ లు ఉన్నా ఆపేసి రావాలన్నారు.
Read Also : Akhanda -2 : అఖండ-2 కొత్త షెడ్యూల్.. అక్కడే షూట్..
ప్రభుత్వంతో జర్నీ చేయాలని.. అది అందరికీ మంచిది అంటూ చెప్పారు. అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నట్టు తెలిపారు. అయితే దిల్ రాజు ఇలా మాట్లాడటం వెనక అసలు కారణం ఉంది. కొందరు హీరోలు రాకపోవడం వల్లే ఇలా మాట్లాడినట్టు తెలుస్తోంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు అవార్డుల వేడుకకు రాలేదు.
ప్రభాస్ నటించిన కల్కి, బాహుబలి సినిమాలకు అవార్డులు వచ్చాయి. మహేశ్ నటించిన మహర్షి మూవీకి, రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు, మూవీకి అవార్డు వచ్చింది. కానీ వీరెవ్వరూ రాలేదు. ఐఫా, సౌత్ ఫిల్మ్ అవార్డుల ఈవెంట్లు జరిగినప్పుడు వచ్చే స్టార్ హీరోలు.. ప్రభుత్వం ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే ఎందుకు రాలేదనే అసంతృప్తితోనే దిల్ రాజు ఇలా మాట్లాడి ఉంటారని తెలుస్తోంది.
Read Also : Israel Iran War: ఇరాన్ ‘‘మిస్సైల్ సిటీ’’ని నాశనం చేసిన ఇజ్రాయిల్..