జయ, ఐష్ తనకు అర్థం కాని భాషలో మాట్లాడుకుంటారంటోన్న అభిషేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్తాకోడలు అంటే ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు! ఇలా తయారైంది బయట వ్యవహారం! కానీ, చాలా ఇళ్లలో అత్తా, కోడలు హ్యాపీగా ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల మంచి ఫ్రెండ్స్ లా కూడా ఉంటారు. అటువంటి సాస్, బహు జోడీనే జయా బచ్చన్, ఐశ్వర్య బచ్చన్!
కొన్నాళ్ల క్రితం మీడియాలో జయా, ఐష్ మధ్య గొడవలంటూ అదే పనిగా వార్తలొచ్చాయి. కానీ, అవన్నీ అబద్ధాలని తేలిపోయేలా ఇప్పటికీ ఒకే ఇంట్లో సంతోషంగా కలసి ఉంటున్నారు అత్తా, కోడలు ఇద్దరూ! అంతే కాదు, జయా బచ్చన్, ఐశ్వర్య అప్పుడప్పుడూ అభిషేక్ ని ఆటపట్టిస్తూ ఉంటారట కూడా! ఆయనకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుకోవాల్సి వస్తే బెంగాలీ భాషలో సంభాషించుకుంటారట. అభీకి ఆ భాష రాదు కాబట్టి తల్లిని, భార్యని చూస్తూ తెల్ల ముఖం వేయాల్సి వస్తుందట!
తన భార్య, తల్లి తనకు అర్థం కాకుండా బెంగాలీలో మాట్లాడుకుంటారని కొన్నాళ్ల క్రితం జూనియర్ బచ్చనే స్వయంగా చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ సంగతి చెబుతూ ‘’ఐశ్వర్య రాయ్ ఓ బెంగాలీ సినిమా చేసింది. అప్పుడు రీతూపర్ణో ఘోష్ దర్శకత్వంలో నటించే ముందు బెంగాలీ నేర్చుకుంది’’ అని వివరించాడు. ఇక జయా బచ్చన్ కు ఎలాగూ బెంగాలీ భాష ధారాళంగా వచ్చిందే! అందుకే, వారిద్దరూ స్మాల్ బికి అర్థం కాకుండా వంగ భాషలో సంభాషిస్తుంటారట!
అభిషేక్ బచ్చన్ త్వరలో ‘బాబ్ బిశ్వాస్’ సినిమాతో జనం ముందుకు రానున్నాడు. ఐశ్వర్య మణిరత్నం మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
Also Read
- Kajal Aggarwal: స్టోరీల ఎంపికపై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.. ఆ ఒక్కరి కోసమే కథలు మారుస్తోందట!
- Romanchakam Glimpse: జానకి చెంతనే రాముడి హృదయం.. సందీప్ వంగా 'రోమాంచకం' గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ ఉందిగా!
- Akhil Akkineni: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్‌పై కన్నేసిన అఖిల్ అక్కినేని.. మైండ్‌లో పెద్ద స్కెచ్చే ఉందిగా!
- Naga Vamsi: పర్సంటేజ్ సిస్టమ్ వెనుక కుట్ర! థియేటర్ల మోసాలను బయటపెట్టిన నిర్మాత నాగవంశీ..
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!