Site icon NTV Telugu

Coolie : ఆ హీరో వల్లే ‘కూలీ’ ఇంత లేట్ అయిందా..!

Coolie

Coolie

Coolie : ఇప్పుడు ఎక్కడ చూసినా కూలీ పేరే వినిపిస్తోంది. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. ఏకంగా కార్పొరేట్ కంపెనీలే తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చేస్తున్నాయంటే మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 14న మూవీ రాబోతోంది. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ ఓ స్టార్ హీరో వల్లే ఇంత లేట్ అయిందంట. అతను ఎవరో కాదు విశ్వనటుడు కమల్ హాసన్.

Read Also : Tollywood Hero : ఎక్కువ మంది హీరోయిన్లతో నటించిన హీరో ఎవరో తెలుసా..?

లోకేష్ ఖైదీ సినిమా తీసినప్పటి నుంచే రజినీకాంత్ తో మూవీ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. విక్రమ్ సినిమా కంటే ముందే రజినీకాంత్ కు ఓ లైన్ చెప్పాడు. దాన్ని డెవలప్ చేయమని రజినీ కోరాడు. అప్పటికి వరుస సినిమాలతో రజినీ బిజీగా ఉన్నాడు. వరుస ప్లాపులతో ఉన్న కమల్ హాసన్ లోకేష్ తో సినిమా చేసేందుకు ఫిక్స్ చేసుకున్నాడు. రజినీ తన చేతిలో ఉన్న సినిమాలు అయిపోయేలోపు కమల్ హాసన్ తో విక్రమ్ పూర్తి చేయాలని లోకేష్ అనుకున్నాడు. అప్పటికప్పుడు విక్రమ్ కథ రెడీ అయిపోవడం తెరమీదకు వెళ్లడం జరిగాయి.

విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ అప్పటికే రజినీ రెండు సినిమాలతో బిజీ షెడ్యూల్ లో ఉన్నాడు. దీంతో విజయ్ తో లియో సినిమా చేశాడు. ఆ మూవీ కంప్లీట్ అయ్యేలోపే కూలీ కథ రెడీ చేసుకున్నాడు. అనిరుధ్ కు తన మనసులో మాట చెప్పి రజినీని కలిసే ఛాన్స్ అడిగాడు. అనిరుధ్ ఇద్దరి మధ్య మీటింగ్ అరేంజ్ చేసి కూలీ కథ సెట్ అయ్యేలా చేశాడు. రజినీకి కథ బాగా నచ్చడంతో పాటు లోకేష్ టేకింగ్ మీద నమ్మకంతో ఓకే చేశాడు. ఇప్పుడు మూవీ థియేటర్లలోకి రాబోతోంది. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది. కమల్ వల్లే లేట్ అయిందని అంటున్నారు నెటిజన్లు.

Read Also : SSMB 29 : రాజమౌళి-మహేశ్ సినిమాలో సనాతన ధర్మం..?

Exit mobile version