NTV Telugu Site icon

Kajal Aggarwal: సమంత లానే కాజల్.. ఆ పార్ట్ కు సర్జరీ..?

Kajal

Kajal

Kajal Aggarwal:చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకోవడం కోసం సర్జరీలు చేయించుకుంటారు అనేది తెలిసిందే. ఇప్పటికే చాలామంచి హీరోయిన్లు ముక్కు, పెదాలు, చిన్ సర్జరీ చేయించుకొని ముఖంలో కొత్త మెరుపులు కొనితెచ్చుకున్నారు. ఇక మొన్నటికి మొన్న సమంత కూడా ముఖానికి సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ లిస్ట్ లో కాజల్ కూడా చేరిందని వార్తలు గుప్పుమంటున్నాయి.

ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న కాజల్ ముఖంలో ఈ మధ్య కొద్దిగా తేడా కనిపిస్తోందని నెటిజన్లు సందేహ పడుతున్నారు. అంతకుముందులా కాజల్ ముఖంలో ఆ స్పార్క్ లేదంటున్నారు. అందుకు కారణం ఆమె పెదాలు మారిపోవడమే.. ఇటీవలే కాజల్ లిప్ సర్జరీ చేయించుకున్నదని టాక్. ముఖం మొత్తం కొద్దిగా బొద్దుగా మారడంతో లిప్ ను కూడాకొంచెం ఉబ్బెత్తి కనిపించేలా సర్జరీ చేయించుకున్నదని అంటున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక కాజల్ రీ ఎంట్రీ కోసం గట్టిగానే కసరత్తులు చేస్తుందని తెలుస్తోంది. మరి ఈ భామ ఎలాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.