Site icon NTV Telugu

Dhurandhar: “ధురందర్” సినిమాలో పాత్రలు నిజ జీవితంలో ఎవరితో సరిపోలుతున్నాయి..?

Dhurandhar

Dhurandhar

Dhurandhar: బాలీవుడ్ సినమా ‘‘ధురందర్’’ దుమ్ము రేపుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. పాకిస్తాన్ రాజకీయాలు, గ్యాంగ్ వార్, ఇండియన్ స్పై ఏజెంట్ల పాత్ర బ్యాక్‌డ్రాప్‌గా నిజజీవితం సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే, దీనిపై అటు పాకిస్తాన్, ఇటు ఇండియాలో కూడా చర్చ నడుస్తోంది. పాకిస్తాన్‌ లోని సింధ్ ప్రావిన్స్ రాజధాని, పాక్ ఆర్థిక కేంద్రం అయిన కరాచీలోని ల్యారీ మాఫియా, టెర్రరిజం వంటికి సినిమాలో కనిపిస్తుంటాయి. ఇండియన్ ఏజెంట్లు శత్రుదేశాల్లో ఎలా చేస్తుంటారనే విషయాలను కూడా ఈ సినిమాలో చూపించారు.

ఉరి: దిసర్జికల్ స్ట్రైక్ దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత అయిన ఆదిత్య ధార్ ఈ సినిమాను తెరకెక్కించారు. రణవీర్ సింగ్, అక్షయ్ కన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అయితే, సినిమాలో కనిపించే పాత్రలు నిజజీవితంలో ఎవరిని పోలి ఉంటాయని ఒక అంచనాకు అభిమానులు వచ్చారు.

రణవీర్ సింగ్: మేజర్ మోహిత్ శర్మ

మేజర్ మోహిత్ శర్మ ఒక సీక్రెట్ మిషన్‌లో ‘‘ఇఫ్తికార్‌ భట్’’ పేరుతో జ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చొరబడిన వ్యక్తి. ఆయన తన ధైర్యసాహసాలకు గాను అశోక చక్ర పురస్కారం అందుకున్నారు. ఆయన జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో వీరమరణం పొందారు.

అర్జున్ రాంపాల్: మేజర్ ఇక్బాల్ ఖాన్

సినిమాలో కనిపించే మేజర్ ఇక్బాల్, ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ పాత్రను పోషించినట్లు భావిస్తున్నారు. ఇతను పాకిస్తాన్మ మాజీ కమాండో. పాక్ ఐఎస్ఐ కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి ప్రసిద్ధి చెందాడు. భారతదేశంలో జరిగిన అనేక ఉగ్రదాడులలో అతని పేరు వినిపించింది. 2011లో పాకిస్థాన్‌లో జరిగిన అమెరికా డ్రోన్ దాడిలో అతను మరణించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అక్షయ్ ఖన్నా: రెహమాన్ డకైత్

అక్షయ్ ఖన్నా రోల్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇతను రెహమాన్ డకైత్ అనే పాత్రను పోషించాడు. కరాచీలో ల్యారీ ఏరియాను శాసించిన మాఫియా డాన్. 2009లో కరాచీలోని స్టీల్ టౌన్ ప్రాంతంలో ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్ నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో డకైత్ హతమయ్యారు.

సంజయ్ దత్: ఎస్పీ చౌదరి అస్లాం.

సంజయ్ దత్ రోల్ కరాచీలోని ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఎస్పీ చౌదరి అస్లాం పాత్రను సూచిస్తుంది. కరాచీలో రౌడీలకు సింహస్వప్నం మారిన పోలీస్ అధికారి అస్లాం పాత్రను పోలి ఉంటుంది. చాలా మంది గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్ చేశాడు. ఈయనపై చాలా సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. చివరగా 2014లో తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) జరిపిన బాంబు పేలుడులో అతను మరణించాడు.

మాధవన్: అజయ్ సన్యాల్

ఈ సినిమాలో మాధవన్ పాత్ర, ప్రస్తుత భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ), మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజిత్ దోవల్ పాత్రను పోలి ఉంటుంది. దీనికి ముందు ఆదిత్య ధార్ డైరెక్ట్ చేసిన ఉరి సినిమాలో కూడా పరేష్ రావల్ అజిత్ దోవల్ పాత్రనే పోషించారు.

Exit mobile version