Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Vikram: వెండితెరపై విలక్షణ నటనతో సరికొత్త ముద్ర వేసుకున్న కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ తన కెరీర్‌ను పరుగులు పెట్టించేందుకు బిగ్గెస్ట్ ప్లాన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు చేసిన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఈసారి ఆయన పక్కా మాస్ యాక్షన్ రూట్ ఎంచుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్లో ధ్రువ్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సరికొత్త చిత్రానికి సంబంధించిన సినిమా టైటిల్ ఈ రోజు అధికారికంగా బయటికి వచ్చింది. ఈ చిత్రానికి మేకర్స్ ‘జాకీ’ (JACKIE) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. “జాకీ – నో రీటేక్స్ అలౌడ్” అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌తో సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. థియేటర్లలో ప్రేక్షకులకు విజిళ్లు వేయించే ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలచబోతున్నామని, ఇది తమ ప్రామిస్ అంటూ యూనిట్ స్పష్టం చేసింది. ధ్రువ్ విక్రమ్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ అవతారంలో ఈ సినిమాలో ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
పాన్-ఇండియా స్థాయిలో భారీ విజయాలు అందుకుంటున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండటం సినిమాకు అతిపెద్ద బలంగా మారింది. టాలెంటెడ్ డైరెక్టర్ కరణ్ ఎ.కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, తన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఇచ్చే మాస్ బీట్స్‌కు ధ్రువ్ విక్రమ్ స్క్రీన్ ప్రజెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద విజిల్స్ పడటం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్ హీరో వారసుడు, టాలీవుడ్‌లోని టాప్ బ్యానర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కలయికలో వస్తున్న ‘జాకీ’ కోలీవుడ్‌తో పాటు తెలుగునాట కూడా మంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వివరాలు, హీరోయిన్, ఇతర నటీనటుల సమాచారాన్ని మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
#Dhruv is J✭CKIE ❤🔥#Jackie – No Retakes Allowed, will be an out and out commercial entertainer, it’s a promise. 💥💥
Directed by @karanAkumar12
A @Music_Santhosh musical 🎼
Produced by @MythriOfficial@WriterSaby @viki_dop @chiya_1009 @PraveenRaja_Off #GMSekhar @vm_mor… pic.twitter.com/Cj5qpWET5C
— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2026
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!