Producer Dheeraj: “అంబాజీపేట” సినిమాలో కులాల గురించి డిస్కషన్.. నిర్మాత కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dheeraj Mogilineni interview about Ambajipeta Marriage Band: దొరసాని, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బేబి వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన సుహాస్ హీరోగా జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని హైలైట్స్ తెలిపారు నిర్మాత ధీరజ్ మొగిలినేని.
– లాక్ డౌన్ తర్వాత డైరెక్టర్ దుష్యంత్ నాకు “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా కథను డైలాగ్ వెర్షన్ తో సహా చెప్పాడు. తన జీవితంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తో రాసుకున్నాడు. స్టోరీ చాలా బాగుంది అనిపించింది. దుష్యంత్ చెప్పిన కథలోని ఎలిమెంట్స్ సహజంగా ఉండి నన్ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కథ ఎలా సహజంగా ఉందో అలాగే కాస్టింగ్, లొకేషన్స్ ఉండాలని ప్లానింగ్ చేసి ప్రీ ప్రొడక్షన్ కు కావాల్సినంత టైమ్ తీసుకుని సినిమా షూటింగ్ బిగిన్ చేశాం. ట్రైలర్ చూసి మా సినిమాలో కులాల గురించి డిస్కషన్ ఉంటుందేమో అనుకుంటున్నా కానీ అలాంటిదేమీ ఉండదు. ఊరిలో జరిగిన కథ కాబట్టి సహజంగా పెద్ద కులాలు, చిన్న కులాలు ఉంటాయి. అంతే కానీ ఒక కులాన్ని కించపరచడం గానీ మరో కులాన్ని గొప్పగా చూపించడం గానీ చేయలేదు అన్నారు.
Also Read
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
– “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇది కామెడీ మూవీ అనుకున్నారు. పాటలు రిలీజ్ చేశాక లవ్ స్టోరీ కావచ్చన్నారు. ట్రైలర్ చూశాక సీరియస్ సబ్జెక్ట్ అని రివీల్ అయ్యింది. సుహాస్ కలర్ ఫోటో లాంటి మూవీ చేశాడు, పెద్ద హీరోల సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. తన నెక్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” అవ్వాలని సుహాస్ కోరుకున్నాడు. అలాగే ఎంతో కమిట్ మెంట్ తో కష్టపడి నటించాడు. సుహాస్ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో స్క్రీన్ మీద చూస్తారు. మేము కూడా అతన్ని ఒక సీరియస్ సబ్జెక్ట్ లోనే చూపించాలని అనుకున్నాం.
– మా సినిమా ద్వారా ఎలాంటి సందేశం చెప్పడం లేదు. ఎలా ఉండాలి అని సూచించడం లేదు. ఒక ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను అలాగే సినిమాగా తెరకెక్కించి చూపిస్తున్నాం. ఇది మంచీ ఇది చెడు..ఇలా మారిపోండి అని ప్రేక్షకులకు చెప్పాలని అనుకోవడం లేదు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. ఇందులో లవ్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. సుహాస్ అక్క క్యారెక్టర్ లో స్కూల్ టీచర్ గా శరణ్య ప్రదీప్ నటించింది. ఆమెది కథలో ఒక కీ రోల్. కథలోని ప్రధాన భాగం ఆమె క్యారెక్టర్ చుట్టూ సాగుతుంది. శరణ్య క్యారెక్టర్ ద్వారా స్టోరీలోని కొన్ని అంశాలు చెప్పాం.
– మేము కథ వినే టైమ్ కు సుహాస్ కలర్ ఫోటో రిలీజైంది, రైటర్ పద్మభూషణ్ షూటింగ్ జరుగుతోంది. కథ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ కు సుహాస్ అయితే యాప్ట్ అవుతాడు అని అనుకున్నాం. తను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. రెండు సార్లు గుండు చేసుకున్నాడు. కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ కోసం సుహాస్ గుండుతో కనిపించాలి. సహజంగా ఉండాలంటే విగ్ పెట్టుకోవద్దు. సుహాస్ బిజీ ఆర్టిస్ట్. కలర్ ఫొటో తర్వాత హీరోగా ఓ పది మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు. వాటి గురించి ఆలోచించకుండా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”లో గుండు చేసుకుని నటించారు. ఆయన కమిట్ మెంట్ కు మేము సర్ ప్రైజ్ అయ్యాం.
– “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” లో హీరోయిన్ గా పేరున్న వారిని తీసుకుంటే కమర్షియల్ ఫీల్ వస్తుందేమో అనుకుని కొత్త వాళ్ల కోసం ఆడిషన్ చేశాం. శివానీ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ కు వచ్చింది. అయితే ఆమె పర్ ఫార్మెన్స్ చూసి హీరోయిన్ గా తీసుకోవచ్చు అని డైరెక్టర్ అన్నారు. అలా మళ్లీ ఆమెను పిలిచి హీరోయిన్ క్యారెక్టర్ కు ఆడిషన్ చేశారు దుశ్యంత్. బాగా చేస్తుందనే కాన్ఫిడెన్స్ రావడంతో హీరోయిన్ గా తీసుకున్నాం. మేము అనుకున్నట్లే తన రోల్ బాగా ప్లే చేసింది.
– మా సినిమాకు శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. తన సంగీతంతో మా సినిమా ఫీల్ ను రెట్టింపు చేశారు. దర్శకుడు దుశ్యంత్ కథతో పాటే డైలాగ్స్ రాసుకుంటాడు. ఆయన కథ, డైలాగ్స్ లో నేటివిటీ కనిపిస్తుంటుంది. దర్శకులు కథ చెప్పినంత బాగా సినిమా చేయరు. కానీ దుశ్యంత్ కథ చెప్పినంత బాగా మూవీని రూపొందించాడు. టెక్నికల్ గా కూడా సినిమా ఆకట్టుకుంటుంది.
- Tags
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!