Chandrabose: ‘రంగస్థలం’ తర్వాత ఆ కిక్ ఇచ్చింది ఈ సినిమానే

Dharmasthala Niyojakavargam

Dharmasthala Niyojakavargam

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో పొలిటికల్ ఎంటర్‌టైనర్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. సాయికుమార్, సుమన్, వితికా షేరు, వరుణ్ సందేశ్, రాజీవ్ కనకాల లాంటి భారీ తారాగణంతో రూపొందిన యూనిక్ మూవీ ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఈవెంట్ లో ఆస్కార్ గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రానికి ఐదు అద్భుతమైన పాటలు రాసిన ఆయన.. “రామ్‌చరణ్ ‘రంగస్థలం’ తర్వాత పాటల పరంగా నాకు అంతటి అపారమైన సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిన ఏకైక చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’” అని కుండబద్దలు కొట్టారు. డబ్బులు వచ్చేలా తీస్తేనే మంచి సినిమా అనే భ్రమలను వదిలి, మంచి సినిమా తీస్తే డబ్బులొస్తాయని నమ్మి దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారని ప్రశంసించారు. గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నటి వితికా షేరు ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో రీ-ఎంట్రీ ఇస్తోంది. ఆమె పాత్రపై చంద్రబోస్ మాట్లాడుతూ.. ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రతిఘటన’లో విజయశాంతికి ఎలాంటి ఐకానిక్ క్యారెక్టర్ లభించిందో, ఈ చిత్రంలో వితికకు అలాంటి పవర్ ఫుల్ రోల్ లభించిందని, కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని చెప్పి క్యూరియాసిటీని పెంచేశారు. కేవలం పాటలు, కథ విన్న వెంటనే ఈ సినిమాకు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానని వితిక స్పష్టం చేశారు.