తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ఇడ్లీ కొట్టు). అక్టోబర్ 1న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే థియేటర్లలో మంచి హిట్ టాక్ దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ – రెండింటిని సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు టాక్ నడుస్తోంది.రిలీజ్ అయిన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్‌కి వస్తుందన్న వార్త ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Bunny Vasu: కిక్ ఇచ్చిన సినిమా మగధీర..
ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం, ఇడ్లీ కడై ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొగా. ఈ సినిమా అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అంటే, థియేటర్లలో ఇంకా రన్ అవుతున్నప్పుడే డిజిటల్ ప్లాట్ఫార్మ్కి రావడం పెద్ద సర్ప్రైజ్. ఇక ధనుష్ కేవలం హీరోగానే కాకుండా రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేయడం ఈ మూవీకి మరింత హైప్ తెచ్చింది. అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్రఖని, నిత్యా మీనన్, షాలిని పాండే వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథలో ధనుష్ “మురుగన్” పాత్రలో కనిపిస్తాడు. కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడం, ఆధునిక ఆశయాలను నెరవేర్చుకోవడం మధ్య కన్ఫ్యూజ్ అయ్యే యువకుడి ఎమోషనల్ జర్నీని ఈ సినిమా చూపిస్తుంది. చివరికి తన మూలాలను తిరిగి చేరుకునే మురుగన్ పాత్రలో ధనుష్ నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తిరుచిత్రంబలం తర్వాత నిత్యా మీనన్‌తో ఆయన జోడీ ఈ సినిమాకు మరో హైలైట్. జివి ప్రకాష్ మ్యూజిక్ కూడా సినిమాకు బలంగా నిలిచింది. మొత్తంగా, థియేటర్లలో బజ్ క్రియేట్ చేసిన ఇడ్లీ కడై ఇప్పుడు ఓటీటీ లోనూ అదే మంత్రాన్ని కొనసాగించనుంది.