ఈ ఏడాది సౌత్ హీరోల నుంచి వరుస సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అదే తరహాలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు ధనుష్ కూడా హిట్ ఫట్ తో సంబంధం లేకుండా తన సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే కుబేర, ఇడ్లీ కొట్టు సినిమాలను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసిన ధనుష్, వీటి తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా మరిన్ని ప్రాజెక్టులను రెడీ చేస్తున్నాడు.
Also Read : Radhika Apte: “నీకు దురద పెడితే నేను గోకి పెడతాను” –స్టార్ హీరో బండారం బయట పెట్టిన రాధిక
బాలీవుడ్‌లో తన మరో సినిమా తేరే ఇష్క్ మైన్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఉన్న ధనుష్, ఈ మూవీతో బాలీవుడ్ ఆడియన్స్‌ను మళ్లీ ఆకట్టుకోబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండానే తన 54వ సినిమా కూడా థియేటర్లలోకి రానుంది. దర్శకుడు విగ్నేష్ రాజా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. అందువల్లే ఫిబ్రవరి 2026 లో ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పటికే నిర్ణయించుకున్నారని సమాచారం. ఇలా వరుస సినిమాలను ప్లాన్ చేస్తూ, రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్న ధనుష్ తన కెరీర్ పేస్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఒకేసారి తమిళం, హిందీ సినిమాలు చేస్తూ, విభిన్న జానర్స్‌లో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్న ధనుష్ రాబోయే నెలల్లో ఫ్యాన్స్‌కి నిజంగానే ఫుల్ మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.