అక్కినేని ఫ్యాన్స్ కు “బంగార్రాజు” ట్రీట్… వరుస అప్డేట్స్

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రూపొందుతన్న సోసియో ఫాంటసీ రొమాంటిక్ మూవీ “బంగార్రాజు” మూవీ. నాగార్జున సరసన రమ్య కృష్ణ జతకట్టగా, యువ సామ్రాట్ నాగ చైతన్యతో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రొమాన్స్ చేయనుంది. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనూప్ రూబెన్స్ సౌండ్‌ట్రాక్‌లను అందించాడు. మొదటి సింగిల్ ‘లడ్డుండా’ సంచలన విజయం సాధించింది. ఇటీవల నాగ చైతన్య కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి ఆమెను నాగ లక్ష్మిగా పరిచయం చేశాడు. పల్లెటూరి అమ్మాయి అవతారంలో కృతి ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ తో అక్కినేని అభిమానులను ఖుషీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ‘బంగార్రాజు’ మేకర్స్.

Read also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్

నవంబర్ 22న సాయంత్రం 5:22 గంటలకు ‘బంగార్రాజు’ ఫస్ట్‌లుక్‌ను, నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా 23న ఉదయం 10:23 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మైసూర్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుండగా, ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున, ప్రతిభావంతులైన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి ‘బంగార్రాజు’ చిత్రం ప్రీక్వెల్. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందించగా, యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Related Articles

Latest Articles