Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush D56 Title: ధనుష్ సినిమాల లైనప్‌లో ఇప్పుడు మరో ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ‘లబ్బర్ పాండు’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళరసన్ పచ్చముత్తుతో ధనుష్ చేస్తున్న D56పై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడుతోంది. ఇప్పటివరకు టైటిల్, కథకు సంబంధించిన వివరాలను టీమ్ చాలా గోప్యంగా ఉంచింది. అయితే తాజాగా ఈ సినిమాకు ‘పడయల్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే వార్తలు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రేపు (సెప్టెంబర్ 17) ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, ధనుష్ D56కి ‘పడయల్’ అనే టైటిల్ పెట్టే అవకాశం ఉంది. తమిళ భాషలో ‘పడయల్’ అంటే ‘దేవుడికి పెట్టే నైవేద్యం’ అనే అర్థం వస్తుంది. అయితే ఇది ఇంకా ఆఫీషియల్ గా ప్రకటించిన టైటిల్ కాదు.
ఇక D56 జానర్ ఒక రా అండ్ ఇంటెన్స్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంతో పాటు హింసాత్మక యాక్షన్ అంశాలు ఇందులో ఎక్కువగా ఉంటాయంట. ఈ కారణంగానే సినిమా ‘పుష్ప’ తరహా రా ట్రీట్మెంట్తో ఉంటుందని, సెన్సార్ పరంగా A సర్టిఫికెట్ వచ్చే అవకాశం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక రూరల్ యాక్షన్ డ్రామాను ప్రముఖ నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్ (Dawn Pictures) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ సరసన కథానాయికగా కన్నడ క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత నటించబోతున్నట్లు వార్తలు వస్తుండగా, ‘తిరుచిత్రంబలం’ వంటి బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ హిట్ తర్వాత ధనుష్‌తో కలిసి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. రేపు (సెప్టెంబర్ 17న) జరగబోయే అధికారిక పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసి, ఈ వివరాలన్నింటినీ అధికారికంగా వెల్లడించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- Suriya - Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' సెన్సార్.. 'A' సర్టిఫికెట్
- Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
ఇదిలా ఉంటే ధనుష్ ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘OM: Chapter One’పై ఫోకస్ పెట్టారు. ధనుష్‌తో పాటు మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16, 2026న థియేటర్లలోకి రానుంది. మరోవైపు రజనీకాంత్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదల కానుండటంతో ఈ రెండు సినిమాలు వరుసగా పండుగ సీజన్లో థియేటర్లలోకి రానున్నాయి. ఇక ధనుష్ ఇప్పటికే వెట్రిమారన్ దర్శకత్వంలో ‘తమిళ్ మురుగన్’ అనే మరో ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో D56కి ‘పడయల్’ అనే టైటిల్ నిజంగానే ఖరారవుతుందా, సినిమా పూజా కార్యక్రమాల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చాకే తెలుస్తుంది. ఒకవేళ ఈ టైటిల్, రూరల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ నిజమైతే ధనుష్ కెరీర్లో మరో డిఫరెంట్ మాస్ అవతార్‌ను అభిమానులు చూడవచ్చు.
తాజావార్తలు
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!