టాలెంటెడ్ హీరో ధనుష్ పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో అండ్ యాక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన అరుణ్ మాతెశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న కెప్టైన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టైన్ మిల్లర్ సినిమాపై కోలీవుడ్ లో భారి అంచనాలు ఉన్నాయి.
ఆ అంచనాలని మరింత పెంచుతూ జులై 28న ధనుష్ బర్త్ డే కావడంతో మేకర్స్ కెప్టైన్ మిల్లర్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ని మేకర్స్ ఇటీవలే లాంచ్ చేసారు. ఫ్రీడమ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ బయటకి వచ్చిన టీజర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇక ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ సాంగ్స్ కి టైమ్ అయ్యింది. జీవీ ప్రకాష్ అండ్ ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి, ఇదే హిట్ లిస్టులో కెప్టెన్ మిల్లర్ కూడా జాయిన్ కానుంది. త్వరలో కెప్టెన్ మిల్లర్ నుంచి మొదటి సాంగ్ బయటకి రానుందని సమాచారం. ఇదిలా ఉంటే కెప్టెన్ మిల్లర్ డబ్బింగ్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. దీపావళి రిలీజ్ కి టార్గెట్ చేస్తూ కెప్టెన్ మిల్లర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. లేటెస్ట్ గా కెప్టెన్ మిల్లర్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న హీరోయిన్ నివేదిత సతీష్… డబ్బింగ్ చెప్తున్నా ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… సంభవం లోడింగ్ అని కోట్ చేసింది. దీంతో ధనుష్ ఫాన్స్ అంతా ఇప్పుడే జోష్ లోకి వచ్చి సోషల్ మీడియాలో #dhanush #Captainmiller టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు.
Sambhavam Loadinnn… 💣
Say whaat, Killer Killer – #CaptainMilIer 🔥 pic.twitter.com/9Lnr8E10I9
— Nivedhithaa Sathish (@nivedhithaa_Sat) September 20, 2023