Dhamki: మాస్ కా దాస్ ‘ధమ్కీ’ ఇవ్వడానికి ఓటిటీకి వస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhamki:మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్ జంటగా నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ నే దర్శకత్వం వహించాడు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్‌పై విశ్వక్ సేన్, కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటిరోజు నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఆ సమయంలోనే బలగం మంచి విజయం సాధించడంతో ధమ్కీ కలక్షన్స్ తగ్గాయనే చెప్పాలి. విశ్వక్ ఈ సినిమాలో డబుల్ రోల్ లో కనిపించాడు. డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే వ్యక్తి సంజయ్ రుద్ర. పుట్టిన తర్వాత అనాథగా మారి చాలా కష్టపడి పెరిగి పెద్దైన మరో వ్యక్తి కృష్ణదాస్..మధ్య జరిగే పోరాటమే దాస్ కా ధమ్కీ. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ ఇద్దరూ ఒకేలా ఉండటం.
Shaakuntalam: సమంత హిట్ కొట్టేసినట్లే.. ఎందుకంటే ?
Also Read
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
విశ్వక్ సేన్, హైపర్ ఆది, మహేష్‌ల నటనతో ఇంటర్వెల్ వరకు సరదాగా సాగిపోయే ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత ఎవరూ ఊహించని టర్న్ తీసుకుంటుంది. అసలు వీరి మధ్య గొడవేంటి? ధనవంతుడు సంఘంలో పేరున్న సంజయ్ రుద్ర ఉన్నట్లుండి కృష్ణదాస్‌ను ట్రాప్ చేయాలనకున్న విషయాలు, కథలో ఉండే ట్విస్టులు, టర్నులు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతాయి. ఇక ఈ సినిమా ఓటిటీలో సందడి చేయడానికి రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఏప్రిల్ 14 న ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. థియేటర్ లో రచ్చ చేసిన ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్‌ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!