Site icon NTV Telugu

Devara Teaser: బ్లడ్ బాత్ టీజర్ వచ్చేది అప్పుడేనా?

Devara

Devara

డిసెంబర్ 29న రిలీజ్ కానున్న డెవిల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో బయటకి వచ్చిన ట్రైలర్ కట్ డెవిల్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ… దేవర సినిమాలో కొత్త ప్రపంచం చూస్తారు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ టైమ్ పడుతుంది. జనవరి మూడోవారంలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. త్వరలో ఒక సాలిడ్ అప్డేట్ తో బయటకు రాబోతున్నాం అని చెప్పాడు. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దేవర ట్యాగ్ ని, ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. కొరటాల శివ దేవర పూజా కార్యక్రమాలు జరిగిన రోజే ఒక ఫర్బిడెన్ ల్యాండ్ లో భయానికే భయం పుట్టించే వీరుడిలా ఎన్టీఆర్ కనిపిస్తాడని చెప్పేసాడు. అందుకు తగ్గట్లుగానే భారీగా దేవర షూటింగ్ సముద్రం బ్యాక్ డ్రాప్ లో హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో జరుగుతోంది.

ప్రస్తుతం దేవర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మెయిన్ కాస్ట్ తో జరుగుతోంది. ఇదిలా ఉంటే త్వరలో మంచి అప్డేట్ బయటకి రాబోతుందని కళ్యాణ్ రామ్ చెప్పింది దేవర టీజర్ గురించే అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేవర టీజర్ త్వరలో వస్తుందనే మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో కళ్యాణ్ రామ్ స్టేట్మెంట్ ఇవ్వడం అభిమానులని ఖుషి చేస్తుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దేవర టీజర్ న్యూఇయర్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ న్యూఇయర్ మిస్ అయితే సంక్రాంతి పండక్కి దేవర టీజర్ సోషల్ మీడియాపై దండయాత్ర చెయ్యడం గ్యారెంటీ. టీజర్ ని అన్ని భాషల్లో రిలీజ్ చేసి పాన్ ఇండియా ప్రమోషన్స్ ని స్టార్ట్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి సంక్రాంతి దేవర ఎంట్రీ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.

Exit mobile version