Devara: అనిరుధ్-ప్రేమ్ రక్షిత్-ఎన్టీఆర్… ఈ కాంబినేషన్ స్క్రీన్స్ ని తగలబెట్టేస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్, కొరటాల శివ ‘దేవర’ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ కి రిపేర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర సినిమా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి… యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర టీమ్, నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్స్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న దేవర, గోవా షెడ్యూల్ లో ఒక సూపర్ సాంగ్ షూట్ ని కూడా కంప్లీట్ చేసుకుందట. దాదాపు 2000 మంది డాన్సర్స్ తో ఈ సాంగ్ ని షూట్ చేశారట.
ఎన్టీఆర్ ఎలాంటి డాన్సర్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ డాన్సర్ కి అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తగిలితే థియేటర్స్ లో ఫైర్ వర్క్స్ జరిగినట్లే. ఇప్పుడు ఈ ఇద్దరికీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా కలిసాడు. అనిరుధ్ కంపోజ్ చేసిన సూపర్ ట్యూన్ కి స్టెప్స్ కంపోజ్ చేసాడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఎన్టీఆర్-ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కాంబినేషన్ లో సూపర్ సాంగ్స్ ఉన్నాయి. ఈ ఆస్కార్ మాస్టర్ ఎన్టీఆర్ తో స్టెప్స్ వేయించిన ప్రతిసారీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవర ఆ సాంగ్స్ ని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో కూర్చోబోతుంది. కెరీర్ బెస్ట్ సాంగ్ ని అనిరుధ్ కంపోజ్ చేసాడు అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అదే నిజమైతే దేవర సాంగ్… పాన్ ఇండియా థియేటర్స్ కి షేక్ చేయడం గ్యారెంటీ.
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!