యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా దేవర. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రానుంది. భారీ సెట్ లో సాంగ్ కి రెడీకి రెడీ అవుతున్న దేవర సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవర సినిమాని ఒక పార్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన కొరటాల శివ, ఇటీవలే దేవర రెండు భాగాలుగా రిలీజ్ కానుందని రివీల్ చేసాడు. పార్ట్ 2 కావాలి అంటే పార్ట్ 1 హై నోట్ లో ఎండ్ అవ్వాలి. KGF 1, బాహుబలి బిగినింగ్… సినిమాలు ఈ రూల్ ని పాటించే పార్ట్ 2 ని కాష్ చేసుకున్నాయి. ఇప్పుడు పుష్ప ది రూల్ కూడా ది రైజ్ సమయంలో ఇచ్చిన సూపర్ ఎండింగ్ కారణంగానే హ్యూజ్ హైప్ ని సొంతం చేసుకుంది.
సో పార్ట్ 2 పై అంచనాలు ఎక్కువగా ఉండాలి అంటే పార్ట్ 1 పర్ఫెక్ట్ గా ఎండ్ అవ్వాలి, ఆడియన్స్ ని పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చెయ్యాలి అనే విషయం బాగా తెలిసిన కొరటాల శివ… దేవర పార్ట్ 1 ఎండింగ్ లో ఎన్టీఆర్ కోసం స్పెషల్ విలన్ ని దించబోతున్నాడని టాక్. పార్ట్ 1 కోసం సైఫ్ అలీ ఖాన్ ని రంగంలోకి దించిన కొరటాల శివ… దేవర-భైరాకి మధ్య ఎలాంటి సీన్స్ ని వేసాడు అనేది చూడాలి. పార్ట్ 1లో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఎండ్ అవ్వగానే పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కొత్త విలన్ గా సంజయ్ దత్ ని తీసుకోని వస్తున్నాడట కొరటాల శివ. ఎన్టీఆర్-సంజయ్ దత్ ల మధ్య జరగబోయే యుద్ధమే పార్ట్ 2 కథగా ఆడియన్స్ ముందుకి రానుంది లేదా దేవర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ని విలన్ గా సంజయ్ దత్ కనిపించాలి. పార్ట్ 1 ఎండ్ లో కనిపిస్తాడా లేక పార్ట్ 2 స్టార్టింగ్ లోనే కనిపిస్తాడా అనేది పక్కన పెడితే అసలు సంజయ్ దత్ ఈ సినిమాలో ఉన్నాడా లేదా అనే విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది.
