Devara: తెలంగాణాలో పెరిగిన దేవర టికెట్ రేట్లు.. ఎంతంటే?
- సెప్టెంబర్ 27న జూనియర్ ఎన్టీఆర్ దేవర
- తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేలా జీవో
- తాజాగా పెంచిన రేట్లు ఎంతంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోని నటించిన దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెంచుతూ అక్కడి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేసింది. మొదటి రోజు భారీగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం రెండు నుంచి పదో రోజు వరకు మరో రేటు అమ్ముకునేలా అవకాశం కల్పించింది. ఇక పెంచిన టికెట్ రేట్ల ప్రకారం మొదటి రోజు సింగిల్ స్క్రీన్సు 295 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 413 రూపాయలు అమ్ముకోవచ్చు. ఇక సింగిల్ స్క్రీన్స్ లో రెండో రోజు నుంచి పదవ రోజు వరకు 206.5 పైసలు మల్టీప్లెక్స్ లలో రెండవ రోజు నుంచి పదవ రోజు వరకు 354 పెంచి అమ్ముకునేలా అవకాశం కలిపిస్తూ జీవో జారీ చేశారు.
Also Read: Oscars: కల్కి 2898 ఏడీ-హనుమాన్ సహా ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీకి పోటీ పడిన 29 సినిమాలివే!
Also Read
- Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
అంతే కాదు మొదటి రోజు మిడ్ నైట్ షోస్ కూడా అనుమతి ఇస్తూ జీవోలో ప్రకటన ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సాధారణంగా రోజుకి నాలుగు షోస్ ఉంటాయి. కానీ మొదటి రోజు ఒక్కొక్క స్క్రీన్ లో ఏడు షోస్ వేసుకునేలా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా పాత్రలో నటించాడు. ఇక కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తుండగా కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని సహ నిర్మిస్తున్నారు. సుమారు 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ వస్తుండడంతో ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!