Site icon NTV Telugu

Dettadi Harika: అలా పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా..

dettadi harika

dettadi harika

యూట్యూబ్ చూసేవారందరికి దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేత్తడి పిల్ల అంటూ తెలంగాణ యాసలో ఆమె చేసే అల్లరి అంతాఇంతా కాదు. ఇక ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచి బయటికి వచ్చి మెప్పించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామకు కూడా ట్రోలింగ్ తప్పలేదు. హారిక కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఆమెను పొట్టి పిల్ల.. బుడ్డది అంటూ ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇచ్చింది. రామయ్య వస్తావయ్యా చిత్రంలోని ఎన్టీఆర్ డైలాగ్ “బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయి ఉండాలి ” అనే వీడియోను పోస్ట్ చేస్తూ అది అర్థమైంది కదా అంటూ ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం హారిక పలు సినిమాల్లో నటిస్తూనే .. మరోపక్క వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. మరి ముందు ముందు అమ్మడు చిత్ర పరిశ్రమలో ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.

Exit mobile version