Deshamuduru: అప్పుడు జస్ట్ తెలుగు స్టార్ హీరో… ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ పుట్టిన రోజు సంధర్భంగా ఫాన్స్ ‘దేశముదురు’ సినిమా 4K రీరిలీజ్ కి రెడీ అయ్యారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయిన దేశముదురు సినిమాని మరోసారి థియేటర్స్ లో చూసి అల్లు అర్జున్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫాన్స్ రెడీ అవుతున్నారు. బన్నీ ఫిల్మోగ్రఫీ మొత్తం ఒకవైపు దేశముదురు సినిమా మాత్రమే ఒక వైపు అనే రేంజులో ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు పూరి జగన్నాధ్. హీరో క్యారెక్టర్ పైనే సినిమా చేసి హిట్ కొట్టగల పూరి జగన్నాధ్, అల్లు అర్జున్ ని పర్ఫెక్ట్ మాస్ హీరోగా ప్రెజెంట్ చేశాడు. గంగోత్రి, ఆర్య, హ్యాపీ, బన్నీ సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చేసి, ఒక కొత్త డైలాగ్ డెలివరీని అల్లు అర్జున్ కి ఇచ్చి దేశముదురు సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు పూరి. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ పడిన కష్టం ఆన్ స్క్రీన్ సిక్స్ ప్యాక్ రూపంలో కనిపిస్తింది. తెలుగు హీరోలు ఫిట్ గా ఉండరు అనే మాటని చెరిపేస్తూ బాలీవుడ్ హీరోలా అల్లు అర్జున్ స్క్రీన్ పైన కనిపిస్తే మెగా ఫాన్స్ మాత్రామే కాకుండా ఇతర హీరోల ఫాన్స్ కూడా దేశముదురు సినిమాని రిపీట్ మోడ్ లో చూశారు.
ఈ మూవీలో బన్నీ చెప్పిన డైలాగ్స్ ని చాలా మంది యూత్ బయట కూడా తెగ వాడేసారు. అయితే అప్పుడు అల్లు అర్జున్ కేవలం ఒక మెగా హీరో మాత్రమే, అప్ కమింగ్ స్టార్ హీరో మాత్రమే ఇప్పుడు అలా కాదు అల్లు అర్జున్ అనే పేరే ఒక బ్రాండ్ అయ్యింది. మెగా హీరో, తెలుగు స్టార్ హీరో అనే మాటలని దాటేసి పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. స్టైల్ కి ఐకాన్ గా ఉండే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు, ఏప్రిల్ 8న పుష్ప 2 అప్డేట్ గ్యారెంటీగా బయటకి వస్తుంది. సాలిడ్ హైప్ ఉన్న పుష్ప 2 నుంచి అప్డేట్ బయటకి వస్తుంది అంటే సోషల్ మీడియాలో సునామీ వస్తుంది. ఇంటర్నెట్ లోనే కాదు గ్రౌండ్ లెవల్లో కూడా అల్లు అర్జున్ ఫాన్స్ సెలబ్రేషన్స్ అదిరిపోయే రేంజులో చేశారు అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి అంటే దేశముదురు సినిమా రీరిలీజ్ కలెక్షన్స్ అదిరిపోవాలి. మరి అల్లు అర్జున్ ఫాన్స్ దేశముదురు సినిమాకి ఎలాంటి కలెక్షన్స్ ఇస్తారు? రీరిలీజ్ ట్రెండ్ లో రికార్డ్ సెట్ చేస్తారా లేదా అనేది చూడాలి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!