NTV Telugu Site icon

Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి డిలీట్ సీన్.. మీరూ ఓ లుక్కేయండి

Arjun Reddy

Arjun Reddy

Arjun Reddy Delete Scene: యంగ్ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా తెచ్చిపెట్టిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. 2017, ఆగస్టు 25న విడుదలైన ఈ మూవీ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినీ అభిమానులకు ట్రీట్ అందించింది. 2.53 నిమిషాల నిడివి ఉన్న డిలీట్ సీన్‌ను తాజాగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమా నుంచి వచ్చిన ఈ డిలీట్ సీన్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతోంది. ఈ సీన్‌లో విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ మధ్య సంభాషణలను చూపించారు. హీరోయిన్ షాలినీ పాండే కోసం హీరో ఆమె ఇంటికి వెళ్లి ముద్దు పెట్టుకోవడం.. అది చూసి హీరోయిన్ వాళ్ల నాన్న హీరోతో గొడవపడిన ఘటనపై ఇద్దరి మధ్య చర్చ సాగింది. ప్రీతి(షాలినీ పాండే)ని ప్రేమతో ముద్దు పెట్టుకుంటే వాళ్ల నాన్న తప్పుగా అర్థం చేసుకున్నాడని విజయ్ దేవరకొండ తన స్నేహితుడి వద్ద ఆవేదన వ్యక్తం చేయడాన్ని ఈ సీన్‌లో చూడొచ్చు.

Read Also: International Dogs Day: ప్రతి కుక్కకు ఓ రోజు.. ఆ రోజు ఈ రోజే..!!

రొమాంటిక్ బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన ఈ మూవీకి అప్పట్లో సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి ఎక్కువ కావడంతో కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించారు. ఈ సన్నివేశాలను ఇప్పుడు డిలీట్ సీన్‌లుగా చిత్ర యూనిట్ అందించే పనిలో పడింది. ఈ మేరకు తొలి డిలీట్ సీన్‌ను గురువారం రాత్రి అప్‌లోడ్ చేశారు. కాగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన షాలినీపాండే హీరోయిన్‌గా నటించింది. వీళ్లిద్దరికీ ఈ మూవీ మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాతే షాలినీపాండేకు అవకాశాలు వరుస కట్టాయి. ఈ మేరకు ఆమె గురువారం నాడు ఓ ట్వీట్ చేసింది. ‘ఐదేళ్ల క్రితం ఇదే రోజు నా మొద‌టి సినిమా అర్జున్ రెడ్డి విడుదలైంది. ఈ సినిమా నా మరపురాని క్షణాల్లో ఒకటిగా నిలిచింది. అర్జున్ రెడ్డిలో ప్రీతి పాత్రపై నాకు లభించిన ప్రేమ, ప్రశంసలు అపూర్వమైనవి. అందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. అర్జున్ రెడ్డికి నేను రుణపడి ఉంటాను’ అంటూ షాలినీ పాండే పోస్ట్ పెట్టింది.

Show comments