Nani: నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై అతని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆంథాలజీ ‘మీట్ క్యూట్’. అతి త్వరలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ఆంథాలజీ టీజర్ శనివారం జనం ముందుకు వచ్చింది. దీన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించింది. అపరిచితుల క్యూట్ మీటింగ్స్, ఆహ్లాదకరమైన సంభాషణలు, భావోద్వేగాలని టీజర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ప్రేమ, కోపం, ఆశ, భయం, ఆశ్చర్యం, హార్ట్ బ్రేక్, నమ్మకం, సంతోషం ఇలా అన్నీ భావోద్వేగాలు ఇందులో ఆకట్టుకునేలా వున్నాయి.
బ్రేకప్స్ కు కారణంగా చెబుతూ సత్యరాజ్ చెప్పిన ఓ డైలాగ్ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. ”చిన్న చిన్న గొడవలు వలన రిలేషన్ షిప్స్ ఫెయిల్ కావు. ఫైట్ చేయటం ఆపేసినప్పుడు ఫెయిల్ అవుతాయి” అనే చెప్పడం బాగుంది. దీప్తి గంటా తన తొలి ప్రయత్నంలోనే రచయిత్రిగా, దర్శకురాలిగా చక్కని ప్రభావాన్ని చూపించారు. ఆమె రచనలో పరిపక్వత కనబడింది. సిరిస్ లో కథలన్నీ అందరూ రిలేట్ చేసుకునేలా, అన్ని వర్గాలా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రూపొందించారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ, గ్యారీ బిహెచ్ ఎడిటింగ్, విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం… ఈ టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఈ టీజర్ చూసిన తర్వాత ప్రీమియర్ డేట్ కోసం వ్యూవర్స్ ఎదురుచూడటం ఖాయం.