Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ఆమె పెడుతున్న కండీషన్లు, వర్కింగ్ టైమింగ్స్, అడుగుతున్న రెమ్యునరేషన్ల గురించి తట్టుకోలేక స్పిరిట్, కల్కి-2 నుంచి తీసేశారు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా ఆమె మీద ట్రోల్స్ వచ్చాయి. నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా దీపిక స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎంతో మంది మగ హీరోలు రోజుకు 8 గంటలే పనిచేస్తున్నారని.. శని, ఆదివారాల్లో రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపింది. చాలా మంది హీరోయిన్లు తల్లి అయ్యాక ఇదే పనిచేస్తున్నారని.. కేవలం తనను మాత్రమే ట్రోల్స్ చేయడం ఏంటని అడిగింది.
Read Also : Mana Shankara Vara Prasad Garu : ‘మీసాల పిల్ల’ సాంగ్ పై అప్డేట్ ఇచ్చిన బుల్లిరాజు
అయితే ఆమె ఇక్కడ ఓ విషయాన్ని పక్కన పెట్టేసింది. అదే కండీషన్లు. వాస్తవానికి దీపికను కేవలం 8 గంటల పని విషయంలోనే తీసేయలేదు. తెలుగు ఇండస్ట్రీలో 8 గంటలు పనిచేస్తే పెద్ద ఇబ్బందేమీ ఉండదు. ఆమె టైమింగ్స్ ను బట్టి ఈజీగా షూటింగ్ చేసేస్తారు. కానీ అంతకు మించి ఆమె పెట్టిన కండీషన్లే తీసేయడానికి అసలు కారణం. కల్కి మొదటి పార్టుకంటే 50 శాతం ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది. అంతే కాకుండా తనతో పాటు 25 మంది స్టాఫ్ వస్తే వాళ్ల ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలని.. ఆమె అలవెన్సులు, లగ్జరీ లైఫ్ కోసం పెట్టే ఖర్చులు అన్నీ నిర్మాతల మీదనే నెట్టేస్తుందనే కారణంతోనే ఆమెను తీసేశారు. కానీ ఆమె మాత్రం వీటిపై స్పందించకుండా.. తన పీఆర్ టీమ్ ద్వారా ఏర్పాటు చేసుకున్న ఇంటర్వ్యూలో కేవలం 8గంటల పనిగురించే ప్రశ్న అడిగించుకుని దానిపైనే స్పందించింది. దీన్ని బట్టే ఆమెను ఎందుకు తీసేశారో అర్థం అవుతోంది.
Read Also : SS Rajamouli : రాజమౌళికి జక్కన్న అనే బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా..?
