బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొనేకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తన అందం, అభినయం, స్టార్ పవర్‌తో ఆలియా భట్ కూడా అదే స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ ఇద్దరి మధ్య పోలికలు చాలాసార్లు అభిమానుల మధ్య చర్చకు దారి తీస్తూ వచ్చాయి. తాజాగా ఓ బ్రాండ్ అంబాసడర్ మార్పు కారణంగా ఈ వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Allu Arjun: బ్యాక్ టు బ్యాక్ 3 అవార్డ్స్.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్
ఇన్నాళ్లుగా అమెరికన్ బ్రాండ్ లెవిస్ కు ప్రచారకర్తగా వ్యవహరించినది దీపికా పదుకొనే. కానీ తాజాగా ఆ బ్రాండ్ కొత్త ముఖం కోసం వెతికింది. చివరికి ఆ గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆలియా భట్‌ని ఎంపిక చేసుకుంది. దీంతో దీపిక ఆ రోల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ నిర్ణయం ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. దీంతో దీపిక అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. “ఎందుకు ఎప్పుడూ ఆలియాకే అన్నీ దక్కాలి? దీపికకు మాత్రమే దక్కాల్సిన అవకాశాలు కూడా ఆమె లాక్కుంటుంది. ఇది అసూయ, అభద్రతాభావం తప్ప మరేమీ కాదు” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
కొంత మంది నెటిజన్లు నేరుగా ఆలియా పై విమర్శలు గుప్పించారు. “దీపిక స్థానాన్ని ఆలియా దొంగిలించింది. మాకు కావల్సింది దీపిక, ఆలియా కాదు” అంటూ ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు. ఇంకొందరు బ్రాండ్‌ను టార్గెట్ చేస్తూ, “దీపికను ఎందుకు మార్చారు? కారణం చెప్పాలి. ఆలియాతో పోల్చితే దీపికనే ఎప్పటికీ బెస్ట్” అని వ్యాఖ్యానించారు. “ఆలియాకు ప్రతిదానిపై చాలా ఆకలి .. అసూయగా ఉంది. దీపికను ఎందుకు ఎప్పుడూ కాపీ చేస్తోంది?” అంటూ కొందరు విసిగిపోయి నట్టు రాశారు. దీంతో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ మరింత హీట్ పెంచాయి. ఒక బ్రాండ్ అంబాసిడర్ మార్పు అభిమానుల మధ్య కొత్త కలహాలకు దారి తీసింది.