బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆధ్యాత్మిక బాటలో నడుస్తుంది.. ఇటీవల పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వస్తుంది.. తాజాగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడం కోసం గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం ద్వారా గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి తిరుమల కొండపైకి చేరుకున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..
మూడున్నర గంటల పాటు నడుచుకుంటూ దీపికా పదుకొణె తిరుమలకు చేరుకున్నారు. మెట్ల మార్గంలో నడుచుకుంటూ వస్తున్న దీపికా పదుకుణె తో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అనంతరం తిరుమల లోని రాధేయం అతిధి గృహానికి చేరుకున్న దీపికా అక్కడే బస చేశారు.
శుక్రవారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో, వీఐపీ విరామ సమయం లో స్వామి వారిని దీపిక దర్శించుకున్నారు.. ఆలయ అర్చకులు ఆమె చేత ప్రత్యేక పూజలు చేయించారు.. అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు.. ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.. ఆమెను భక్తులు చూసేందుకు ఉత్సహంగా ముందుకు వచ్చారు…సెల్ఫీల కోసం ఎగబడ్డారు.. అనంతరం ముంబై తిరిగి బయలుదేరినట్లు సమాచారం.. ప్రస్తుతం దీపికా వరుస సినిమాలకు సైన్ చేస్తుంది.. మరోవైపు ప్రముఖ బ్రాండ్ లకు ఎంబాసిడర్ గా వ్యవహారిస్తున్నారు.. ఈ ఏడాది ఆమె అకౌంట్ లో మరో బ్రాండ్ చేరినట్లు తెలుస్తుంది..