NTV Telugu Site icon

Deepavali: దీపావళి రిలీజ్ సినిమాలు ముందు రోజుకు షిఫ్ట్.. ఎందుకంటే?

Deepavali Movies

Diwali Movies

Deepavali: బతుకమ్మ, దసరా పండగ సందడి అయింది త్వరలో దీపావళి హడావిడి మొదలు కాబోతుంది. మరో వారం రోజుల్లో ఈ ఫెస్టివల్ సంబరాలు స్టార్ట్ కానున్న క్రమంలో దీపావళి పండక్కి ఆరు పెద్ద సినిమాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. దీపావళి చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దీపావళికి, ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, వీటిలో నాలుగు ఒరిజినల్ తెలుగు సినిమాలు కాగా.. మరో రెండు తమిళ్ డబ్ మూవీస్ కూడా ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న లేటేస్ట్ మూవీ KA అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కాబోతుంది. అలాగే మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగులో నేరుగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్ ను కూడా అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నారు.

Also Read: Venkatesh- Nithin: వెంకీమామతో మహానటి-నితిన్?

అలాగే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జీబ్రా దీపావళి రేసులో ఉంది. అలానే శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్, జయం రవి సోదరుడు నటించిన చిత్రాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యాయి. ఆ సినిమాలు కూడా దీపావళికి పేక్షకుల ముందుకు రానున్నాయి. అమరన్ సినిమా కోసం తెలుగు అడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఒకే సమయంలో ఆరు సినిమాలు విడుదల కాబోతుండడంతో బాక్సాఫీస్ వద్ద ఎవరు గెలుస్తారనే సందిగ్ధత ఉన్నా ఇప్పుడు మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 30 న లక్కీ భాస్కర్ ఈవెనింగ్ షోస్ తోనే రిలీజ్ కానుంది. అదే రోజు #KA ప్రీమియర్స్ కూడా వేసే ఆలోచనలో ఉన్నారు. 31న అంటే దీపావళికి అమావాస్య కావడంతో సెంటిమెంట్ గా సినిమాలను ఒకరోజు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది