నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఈ యాక్షన్ డ్రామా బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబోలో వస్తున్న మూడవ చిత్రం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన “సింహా”, “లెజెండ్” చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లను అందుకున్నాయి. కాబట్టి ఈ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ డ్రామా “అఖండ”తో మ్యాజిక్ మూడవసారి పునరావృతమవుతుందని భావిస్తున్నారు నందమూరి అభిమానులు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా ప్రమోషన్లకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం “అఖండ” ట్రైలర్‌ను నవంబర్ 15న విడుదల చేయనున్నారు. సినిమా విడుదలకు ఇంకా ఒక నెల మాత్రమే సమయం ఉండడంతో నవంబర్ 15న ట్రైలర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే నవంబర్ నాలుగో వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Read Also : “శ్యామ్ సింగ రాయ్” హిందీ రీమేక్ లో స్టార్ హీరో ?
బాలకృష్ణ సరసన కంచె ఫేమ్ నటి ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, శ్రీకాంత్ మేక విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు. బాలయ్య, ప్రగ్యా కలిసి నటించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి ఎం రత్నం డైలాగ్స్ అందించారు. దీనిని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు.