తమిళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి..ప్రజంట్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. తెలుగులో కూడా తనకంటూ మంచి మార్కెట్ ఏర్పర్చుకున్నాడు. రీసెంట్ గా ‘అమరన్’ మూవీతో శివకార్తికేయన్ భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అతని ఫ్యాన్ బేస్ మరింత పెరిగిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.ఇందులో భాగంగా ప్రజంట్ శివ కార్తికేయన్ లైన్ లో పెట్టిన చిత్రాలో, దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ ప్రాజెక్ట్ కూడ ఒకటి. అయితే ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ పై ఇప్పుడు సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది.
Also Read:Dhanunjay: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ‘పుష్ప’ విలన్..
ఏంటీ అంటే మేకర్స్ ఈ సినిమా తాలూకా టైటిల్ గ్లింప్స్‌ని ఈ ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకి వదులుతున్నట్లు క్రేజీ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాకి మురుగదాస్ ఎలాంటి టైటిల్‌ని లాక్ చేసారో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక మురుగదాస్, శివకార్తికేయన్ ఇద్దరు ఆల్రెడీ వేరే వేరేగా సికందర్, పరాశక్తి అనే సినిమాలు చేస్తున్నారు. ఇవి ఈ ఏడాది లోనే విడుదల కానున్నాయి. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ ‘సికందర్’ మూవీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తుండగా, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మాన్ జోషి ప్రతీక్ బబ్బర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.