Dasara : నాని గ్యాంగ్ కు కష్టాలు !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు “దసరా” షూటింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. “దసరా”లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. “దసరా” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అందులో నాని బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అందరినీ షాక్ కు గురి చేసింది. ‘దసరా’కు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో “దసరా’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా షూటింగ్ లో బిజీగా ఉన్న నాని గ్యాంగ్ కు కష్టాలు మొదలయ్యాయట. షూటింగ్ కోసమని తెలంగాణలోని ఓ ప్రాంతానికి వెళ్లగా, అక్కడ సరైన వసతులు లేక ఇబ్బందులు పడ్డారట “దసరా” టీం.
Read Also : KGF Chapter 2 : బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్… మరో పార్ట్ లోడింగ్
Also Read
- Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
- King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న 'కింగ్ 100'
- Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
- Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
ప్రస్తుతం ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో నాని, కీర్తి సురేష్ లపై ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని (తెలంగాణ)లో చిత్రీకరణ జరుగుతోంది. టీమ్ మొత్తం అధిక ఉష్ణోగ్రతలు, తేమలో చాలా కష్టపడి పని చేస్తోంది. ఈ పాట కోసం 500 మంది బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లతో కొరియోగ్రఫీ చేసి భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అయితే గోదావరిఖనిలో పెద్దగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి లేకపోవడంతో… ఈ 500 మంది డ్యాన్సర్లతో పాటు జూనియర్ ఆర్టిస్టులకు వసతి కల్పించడానికిప్రభుత్వ అతిథి గృహాలు, ఇతర ప్రైవేట్ సంస్థలను, కల్యాణ మండపాలను బుక్ చేశారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇది ఇబ్బంది మాత్రమే కాదు ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పాలి.
తాజావార్తలు
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?