Darshini Telugu Movie Trailer : వికాస్, శాంతి హీరో హీరోయిన్లుగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో వి 4 సినీ క్రియేషన్స్ పతాకం పై డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ “దర్శిని”. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. కాకినాడ జెఎన్టియు యూనివర్సిటీలో చదువుకున్న ఇద్దరు ప్రొఫెసర్లు సినిమా మీద ప్రేమతో ఈ దర్శిని సినిమాను నిర్మించారని చెబుతున్నారు. దర్శిని సినిమాలో మూడు ముఖ్య పాత్రలు ఉంటాయని, జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ముగ్గురు కి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేదే మా కథ అని చెబుతున్నారు.
Pooja Hegde : ఈ సారి టిల్లుకి జోడిగా బుట్టబొమ్మ..?
సినిమా చాలా బాగా వచ్చిందని, మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. మే నెలలో విడుదల చేస్తాం అని అంటున్నారు మేకర్స్. మానవ జాతికే నమ్మశక్యం కానీ ప్రయోగం, భవిష్యత్తుని తెలుసుకోవడం అంటూ సాగుతున్న డైలాగ్స్ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భవిషత్తు తెలుసుకునే వస్తువుకి దర్శిని అని టైటిల్ పెట్టడం, దాని చుట్టూనే కథ మొత్తం తిరుగుతూ ఉండటం గమనార్హం. ఇక సైన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తిన్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.