Prabhas : తన మూవీస్‌కు తప్ప పక్కసినిమాలన్నిటికీ ప్రమోషన్ చేస్తున్న డార్లింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెబల్ స్టార్ సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందే. అయితే చిత్ర పరిశ్రమలో డార్లింగ్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రభాస్ తన సొంత సినిమాల ప్రమోషన్ల విషయంలో చాలా సైలెంట్ గా ఉంటాడని కానీ తోటి హీరోల, చిన్న సినిమాల ప్రమోషన్ల కోసం మాత్రం ముందుంటాడనే టాక్ టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ‘సింగ్ గీతం’ మూవీ కోసం ప్రభాస్ చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ అశ్విన్ నిర్మించిన ‘సింగ్ గీతం’ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగాడు. ఈ చిత్ర ప్రమోషనల్ వీడియోలో ప్రభాస్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అసలు ఈ సినిమాలో నన్నెందుకు తీసుకోలేదు? అంటూ డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై సరదాగా జోకులు వేస్తూ సందడి చేశాడు. గతంలోనూ సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి సపోర్ట్ చేసిన ప్రభాస్.. రీసెంట్గా శర్వానంద్ నటించిన ‘బైకర్’ మూవీ ప్రమోషన్ లోనూ భాగమయ్యాడు.
Also Read
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
- Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా 'బాహుబలి' ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
తన సినిమాలకు పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రభాస్ బయట సినిమాలకు ఎందుకు అంత టైం ఇస్తున్నాడనే దానికి టాలీవుడ్ వర్గాల్లో కొన్ని ఆసక్తికరమైన కారణాలు వినిపిస్తున్నాయి. ‘యువి క్రియేషన్స్’ బ్యానర్ లో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ వంశీ, బ్రదర్ ప్రమోద్ నిర్మాతలుగా ఉన్నారు. దీనికి ప్రభాస్ షాడో ప్రొడ్యూసర్ అనే ప్రచారం ఉంది. అందుకే ఆ బ్యానర్ సినిమాలకు డార్లింగ్ ఎప్పుడూ అండగా ఉంటాడు. అలాగే వైజయంతీ మూవీస్ బ్యానర్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’, రాబోయే ‘కల్కి 2’ చిత్రాల దర్శకుడు నాగ అశ్విన్ అంటే ప్రభాస్‌కు ఎనలేని అభిమానం. నాగ అశ్విన్ గతంలో నిర్మించిన ‘మహానటి’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో పాటు ఇప్పుడు తాజాగా ప్రొడ్యూస్ చేసిన ‘సింగ్ గీతం’ మూవీకి కూడా ప్రభాస్ తన వంతుగా ఫుల్ ప్రమోషన్ చేసి పెట్టాడు. ఏదేమైనా తోటి మేకర్స్ కోసం, స్నేహితుల కోసం ప్రభాస్ చూపిస్తున్న ఈ పెద్ద మనసుకు డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!