గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. స్టార్ డైరెక్టర్ బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్య జైస్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా బాలీవుడ్ యాక్షన్ స్టార్ బాబీ డియోల్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్. కాగా ఈ సినిమా టికెట్ ధర పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏ రోజు ఎంతెంత ఉన్నాయంటే ‘రిలీజ్ రోజు అనగా జనవరి 12 తెల్లవారుజామున 4 గంటల బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500 గా నిర్ణయించారు. అలాగే రిలీజ్ నాటి నుండి జనవరి 25 వరకు సింగిల్ స్క్రీన్స్ లో రోజుకి 5 షోస్ కు అనుమతి ఇచ్చారు. అలాగే రెగ్యులర్ షోస్ కు మల్టీప్లెక్స్ టికెట్ ధరపై పై రూ. 135, సింగిల్ స్క్రీన్‌లపై రూ. 110 పెంచుతూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న డాకు మహారాజ్ పెరిగిన టికెట్ ధరతో భారీ ఓపెనింగ్ రాబట్టనుంది. మరోవైపు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.