Custody Trailer: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక కానిస్టేబుల్.. ఒక నిజం కోసం ఎలా పోరాడాడు అనేది సినిమా కథగా తెలుస్తోంది. శివ(నాగ చైతన్య) కు స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ గా ఉద్యోగం వస్తుంది. తప్పు చేసినవారు ఎంతటి వారు అయినా శిక్ష అనుభవించక తప్పదు అనే సిద్ధాంతం ఉన్నవాడు శివ.. దీంతో ఆ నిజాయితీతోనే కొన్ని చిక్కుల్లో పడతాడు. అనుకోకుండా ఒక నిందితుడు కస్టడీ నుంచి పారిపోతాడు. అతడిని పట్టుకొని అప్పగించడానికి శివ ఏం చేశాడు.. ఆ నిందితుడు చేసిన క్రైమ్ ఏంటి..? అసలు శివకు అతనికి సంబంధం ఏంటి.. అతడిని కాపాడడానికి శివ ఎందుకు ట్రై చేస్తున్నాడు అనేది కథగా తెలుస్తుంది.
Rana Daggubati: ‘పరేషాన్’ చేయబోతున్న తిరువీర్!
సాధారణంగా.. పోలీస్ ఎప్పుడు క్రిమినల్ ను చంపాలనే చూస్తాడు.. ఇది అందరికి తెల్సిందే.. కానీ, ఈ సినిమాలో క్రిమినల్ ను చంపకుండా ఉండడానికి పోలీస్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే ఈ సినిమాలో కొత్త పాయింట్.. అందుకు కారణాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చై.. కానిస్టేబుల్ గా అదరగొట్టేశాడు. ఉప్పెన తరువాత కృతికి మంచి రోల్ పడినట్లు తెలుస్తోంది. ఇక సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. ఇళయరాజా నేపధ్య సంగీతం మరొక ఎత్తు. ఏదిఏమైనా ట్రైలర్ తోనే సినిమాపై హైప్ పెంచేశారు. ఈసారి ఎలాగైనా చై హిట్టు కొట్టేలానే కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.