Sukumar: ‘బేబీ’కి పడిపోయిన సుకుమార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం థియేటర్లో బేబీ హవా మామూలుగా లేదు. ఫస్ట్ వీకెండ్‌లో 23 కోట్లు కొల్లగొట్టిన బేబీ 5 రోజుల్లోనే 38 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ లెక్కన సెకండ్ వీకెండ్ వరకు బేబీ హాప్ సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పొచ్చు. ఆనంద్ దేవరకొండ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా ఉంది. ఇక యూట్యూబర్‌గా ఉన్న వైష్ణవి చైతన్యకు ఈ సినిమా బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికే బేబీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇక డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బేబీకి ఇంప్రెస్ అయిపోయారు. ఇక ఇప్పుడు మన లెక్కల మాస్టారు సుకుమార్… బేబీ సినిమాకు ఫిదా అయిపోయాడు. బేబీని ఆకాశానికెత్తేశాడు సుక్కు., బేబీని ఓ రేంజ్‌లో పొగుడుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
చాలా కాలం తర్వాత ఇలాంటి అసాధారణమైన రచనను చూశాను. ఖచ్చితంగా ఈ సినిమా.., సినిమా రచనలో ఒక కొత్త వేవ్‌ని తీసుకొస్తుంది. ప్రతి సన్నివేశం సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపించింది. కుడోస్ టు డైరెక్టర్ సాయి రాజేష్. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు నిర్మాతలు ఎస్‌కెఎన్, మారుతీలను అభినందిస్తున్నాను. వైష్ణవి చైతన్య, ఆనంద్ అదరొట్టేశారు. విరాజ్ కూడా బాగా నటించాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం, బాలరెడ్డి సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని అన్నారు. మొత్తంగా సుకుమార్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ బేబీని ప్రశంసలతో ముంచెత్తడం, సినిమా కలెక్షన్స్ కి మరింత బూస్టింగ్ ఇచ్చినట్టయింది. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’మూవీ థియేటర్లోకి వచ్చే వరకు బేబీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అని చెప్పొచ్చు.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
I feel I won Oscar
When i got an Appreciation call and message from Creative Genius SUKUMAR garu about #BabythefilmI started the film journey as #Arya movie distributor, now feeling high when Sukku Bhai said raving abt it 🙏🤗
Chaalu Inka Maa Eluru vellipovachu ❤️❤️❤️ pic.twitter.com/mutd1A5nWE
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 19, 2023
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!