Shankar: ఇండియన్ 2 ఓకే సార్… మా గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కమల్ హాసన్ ‘సేనాపతి’ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అవినీతిపైన పోరాడే ఈ క్యారెక్టర్ ని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… శంకర్-కమల్ హాసన్ లు ఇండియన్ 2ని గ్రాండ్ గా అనౌన్స్ చేసారు. అయితే కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో, అన్ని కారణాలు ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఆగిపోవడానికి కూడా ఉన్నాయి. ఎన్నో మంతనాలు, రెడ్ జెయింట్ ఇన్వాల్వ్మెంట్ తర్వాత అన్ని సమస్యలు సాల్వ్ అయ్యి గతేడాది సెప్టెంబర్‌లో ఇండియన్ 2 సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయ్యింది.
అప్పటి నుండి ఇండియన్ 2 షూటింగ్ బ్రేక్ లేకుండా జరుగుతూనే ఉంది. దాదాపు చివరి దశకు చేరుకున్న ఇండియన్ 2 సినిమా పనులని శంకర్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. లాస్ ఏంజిల్స్ లో ఇండియన్ 2 విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ని శంకర్ స్టార్ట్ చేసాడు. ఇండియన్ 2 వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి, అక్కడి వరకూ బాగానే ఉంది కానీ రామ్ చరణ్ తో శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి ఏంటి అనేది ఎవరికీ తెలియదు. గత నెల ముందు వరకూ ప్రతి మంత్ లో 12 రోజుల పాటు గేమ్ ఛేంజర్ షూటింగ్ జరిగింది. ఇప్పుడు అది కూడా జరగట్లేదు, ఈ డిలేకి కారణం ఏంటి అనే విషయంలో అప్డేట్ లేదు. షూటింగ్ డిలే అవుతూ ఉండడంతో గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి నుంచి 2024 సమ్మర్ కి వాయిదా పడింది. మరి ఇలానే షూటింగ్ వాయిదా పడుతూ వస్తే గేమ్ ఛేంజర్ 2024 మిడ్ తర్వాతే రిలీజ్ అవుతుంది.
Also Read
Scanning the advanced technology at Lola VFX LA ✨#Indian 2 pic.twitter.com/816QYA7sCN
— Shankar Shanmugham (@shankarshanmugh) July 23, 2023
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!