NTV Telugu Site icon

Retro : ‘రెట్రో’ స్పెషల్ సాంగ్‌లో ఒకప్పటి హీరోయిన్

Shirya

Shirya

దాదాపు 20 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఓ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతున్నప్పుడల్లా ఐటమ్ సాంగ్స్ ఆమెను కాపాడాయి. ప్రెజెంట్ ఒక్కటంటే ఒక్క ఆఫర్ లేక సతమతమౌతున్న హీరోయిన్ .. తిరిగి స్పెషల్ సాంగ్‌నే చూజ్ చేసుకుంది. పెళ్లై పాప పుట్టినా కూడా సేమ్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తోంది శ్రియా. టాలీవుడ్, కోలీవుడ్‌లో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా మారిన శ్రియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండున్నర దశాబ్దాలు కావొస్తున్నా అదే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. అయితే కెరీర్ విషయానికి వస్తే మునుపటిలా మెరుపులు చూపించలేకపోతుంది బ్యూటీ.

Also Read : Vikram : విక్రమ్ సినిమా తెలుగు స్టేట్స్ మంచి ధర పలికింది

శ్రియా చేతిలో ప్రెజెంట్ ఒక్కటంటే ఒక్క ఆఫర్ మాత్రమే ఉంది. అదీ కూడా స్పెషల్ సాంగ్. రెట్రోలో సూర్యతో కలిసి స్టెప్పులేయబోతుంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. గోవాలో స్పెషల్ గా వేసిన సెట్స్ లో ఐటమ్ సాంగ్ చిత్రీకరించారు. ఫస్ట్ టైం సూర్యతో జోడీ కడుతోంది శ్రియా శరణ్. ఈ పాట డిసెంబర్ లో రిలీజ్ అవుతుందనుకుంటే దాచారు మేకర్స్. మే ఒకటిన సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్లలో భాగంగా ఈ పాటను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. హీరోయిన్‌గా కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో స్పెషల్ సాంగ్ చేసి మళ్లీ ట్రాక్ ఎక్కింది శ్రియా. మున్నాలో ఆడిపాడాక శివాజీ లాంటి భారీ ఆఫర్ పొందింది. తులసిలో నర్తించాక బాలీవుడ్, హాలీవుడ్ ఆఫర్లను అందుకుంది. ఒక్కసారే కాదు ఇలా పలుసార్లు ఆమెను గట్టెక్కించాయి ఐటం సాంగ్స్. ఇప్పుడు హీరోయిన్ గా ఒక్కటంటే ఒక్క ఛాన్స్ లేక సతమతమౌతున్న శ్రియాకు రెట్రో స్పెషల్ సాంగ్ మళ్లీ ఆఫర్లను తెచ్చిపెడుతుందేమో చూడాలి.