Vijay Cinema House : కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. కోలీవుడ్‌లో రీసెంట్‌గా ‘జో’ అంటూ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ లాంటి సినిమాలతో అద్భుతమైన నటన కనబర్చిన ఏగన్, ‘కోర్ట్’ మూవీతో ఆకట్టుకున్న శ్రీదేవీ, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
Read Also : Mythri Movie Makers : ప్రశాంత్ నీల్-మైత్రీ మూవీస్ కాంబోలో కొత్త మూవీ స్టార్ట్
ఈ ప్రాజెక్ట్‌కు రీసెంట్ సెన్సేషన్ విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇతను ‘బేబీ’, ‘కోర్ట్’ సినిమాలకు మ్యూజిక్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆహా కళ్యాణం’ డైరెక్ట్ చేసిన యువరాజ్ చిన్నసామి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘జో’ విజయం తర్వాత విజన్ సినిమా హౌస్ మంచి సబ్జెక్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందించేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త తరహా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలిపారు మూవీ మేకర్స్. ఈ సినిమాతో శ్రీదేవి మరో హిట్ అందుకుంటుందా లేదా చూడాలి.
Read Also : Balakrishna – Gopichand : బాలయ్య-గోపీచంద్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్
