ఈ ఏడాది ఆడియన్స్ కి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో తప్పకుండా ‘కాంతార’ పేరు ఉంటుంది. కన్నడలో 16 కోట్లతో తెరకెక్కిన ‘కాంతార’ అక్కడ హిట్ అయ్యి, ఇండియా మొత్తం పాకింది. అన్ని ఇండస్ట్రీల్లో కాంతార సినిమా నేవార్ బిఫోర్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఒక చిన్న సినిమా 400 కోట్లు రాబట్టగలదా అని ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయే రేంజులో వసూళ్లు చేసిన కాంతార సినిమా ఇటివలే ఒటీటీలో రిలీజ్ అయ్యింది. కాంతార ఒటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేసిన సినీ అభిమానులు, ఈ సినిమాని చూసి షాక్ అయ్యారు. దీనికి కారణం వాళ్లు థియేటర్స్ లో చూసిన ‘వరాహ రూపం’ సాంగ్ ఒటీటీలో కనిపించక పోవడమే.
అక్టోబర్ నుంచి జరుగుతున్న ‘వరాహ రూపం’ సాంగ్ కాపీ ఇష్యూ కోర్ట్ కి వెళ్లడంతో, ఇంకో వెర్షన్ లో ఉన్న ‘వరాహ రూపం’ సాంగ్ తో ‘కాంతార’ సినిమా ఒటీటీలో విడుదలవ్వాల్సి వచ్చింది. కొత్త వెర్షన్ లో ‘వరాహ రూపం’ సాంగ్ ని ఒటీటీలో చూడగానే సినీ అభిమానులు పాత వరాహ రూపం సాంగ్ కావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పోస్ట్ లు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ హడావుడి కొనసాగుతుండగానే కోజికోడ్ కోర్ట్ ‘వరాహ రూపం’ సాంగ్ కాపీ రైట్ వివాదాన్ని పరిష్కరిస్తూ, మేకర్స్ ఒరిజినల్ పాటని వాడుకోవచ్చు అంటూ తీర్పునిచ్చింది. కాపీ ఇష్యూ పరిష్కారం అవ్వడంతో, థియేటర్స్ లో చూసిన వరాహ రూపం పాటనే ఒటీటీలో కూడా యాడ్ చేయండనే డిమాండ్ వినిపిస్తోంది. మరి హోంబెల్ ఫిల్మ్ మేకర్స్, అభిమానుల కోరిక మేరకు ‘వరాహ రూపం’ సాంగ్ థియేటర్ వెర్షన్ తో ‘కాంతార’ సినిమాని మళ్లీ ఒటీటీలో రిలీజ్ చేస్తారేమో చూడాలి.