Site icon NTV Telugu

పెళ్లిరోజే ప్రియాంక చోప్రా కీలక నిర్ణయం.. భర్తతో విడాకులపై క్లారిటీ

priyanka chopra

priyanka chopra

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్ తో విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. మునెప్పడూ లేనివిధంగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నుంచి తన భర్త పేరును తొలగించడంతో.. ఈ జంట విడిపోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఈ వార్తలపై ప్రియాంక తల్లి స్పందించినా.. ప్రియాంక మాత్రం స్పందించలేదు. ఇక తాజాగా అమ్మడు తన పెళ్లి రోజును భర్తతో గ్రాండ్ గా జరుపుకొని ఆ వార్తలకు చెక్ పెట్టింది. డిసెంబర్ 1 కి ప్రియాంక – నిక్ ల బంధానికి మూడేళ్లు నిండాయి.. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. భర్త నిక్ తో కలిసిఉన్న ఫోటోలను షేర్ చేస్తూ నిక్ దొరకడం తన అదృష్టమని తెలిపింది. ఇకపోతే ఈ ఫొటోలతో విడాకులపై క్లారిటీ వచ్చినట్లే అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ప్రియాంక భర్తకు వెడ్డింగ్ గిఫ్ట్ గా అరుదైన బహుమతిని ఇవ్వనున్నదంట.. అదేంటంటే .. తన భర్తను బాలీవుడ్ కి హీరోగా పరిచయం చేయనున్నదట.. ఇప్పటికే ఈ విషయమై పలువురు డైరెక్టర్లను అమ్మడు కలిసిందని తెలుస్తోంది. స్క్రిప్ట్ మంచిది దొరికితే .. తానే స వాయంగా భర్తను లాంఛ్ చేయనున్నదట. మరి నిక్ జోనస సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికా అందం.. కండలు తిరిగిన దేహం.. చూడడానికి నిక్ హీరోలానే ఉంటాడు.. దీంతో అభిమానులు కూడా త్వరగా కనెక్ట్ అవుతారని ప్రియాంక భావిస్తున్నదట. మరి భర్త విషయంలో ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్న గ్లోబల్‌ బ్యూటీ ప్రయత్నాలు ఫలించి నిక్ బాలీవుడ్ హీరోగా మారతాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version