NTV Telugu Site icon

NBK108: బాలయ్య పాట చాలా కాస్ట్‌లీ గురూ!

Balayya Costliest Song

Balayya Costliest Song

Costliest Song Shot On Balayya And Sreeleela For NBK108: అఖండ, వీరసింహారెడ్డి సినిమాల విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. అంతేకాదు.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తమ సినిమాని తీసుకొస్తున్నామని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది కూడా! ఆ సమయంలోపు సినిమాని కంప్లీట్ చేసేలాగా.. శరవేగంగా పనులను కానిచ్చేస్తున్నారు. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా.. ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం చకచకా షూటింగ్ నిర్వహిస్తున్నారు.

SS Rajaomouli: దసరాపై రాజమౌళి ప్రశంసలు.. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావంటూ నానికి కితాబు

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులోని ఒక పాట కోసం మేకర్స్ ఏకంగా రూ.5 కోట్లు వెచ్చిస్తున్నారట. గణేశుడిపై ఈ గీతం సాగనుందని, ఇందుకోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక భారీ సెట్ సిద్ధం చేశారని తెలిసింది. ఆల్రెడీ ఆ సెట్‌లో బాలయ్య, శ్రీలీలలపై ఆ పాటని చాలా గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నారని సమాచారం. బాలయ్య కెరీర్‌లో ఒక పాటను ఇంత భారీ ఖర్చుతో చిత్రీకరించడం ఇదే మొదటిసారి. దీంతో.. ఇది బాలయ్య కెరీర్‌లో కాస్ట్‌లీ పాటగా నిలిచింది. రూ.5 కోట్లతో అనిల్ రావిపూడి ఈ పాటతో రూపొందిస్తున్నాడంటే.. కచ్ఛితంగా ఇది విజువల్ ట్రీట్‌గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.

Sai Dharam Tej: విరూపాక్ష ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది

కాగా.. ఇందులో బాలయ్య, శ్రీలీల తండ్రి, కూతురుగా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను రంగంలోకి దింపారు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో.. డైరెక్టర్ అనిల్ రావిపూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యాడు. బాలయ్య వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉండటం, అనిల్ రావిపూడి కూడా ఒక్క ఓటమిని ఎదుర్కోకపోవడంతో.. వీరి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Anasuya: ఆంటీ వివాదంపై అనసూయ రియాక్షన్.. కోపానికి కారణం అదే!

Show comments