Mollywood : కాంట్రవర్సీ.. కేరాఫ్ ‘కేరళ సినిమా’ ఇండస్ట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంట్రవర్సీస్ లేకుండా టైమ్ పాస్ కావడం లేదు మాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. లాస్ట్ ఇయర్ జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక ఎంతటి ప్రకంపనలు సృష్టించాయో ఇండస్ట్రీకి తెలుసు. కౌస్టింగ్ కౌచ్, లైగింక వేధింపులు, వివక్ష ఉన్నాయని వెల్లడి కావడంతో పాటు పలువురు యాక్టర్లు, ఫిల్మ్ మేకర్ల అరెస్టులు, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవికి మోహన్ లాల్‌తో సహా మరికొందరి రాజీనామాలు చకా చకా జరిగిపోయాయి. దాంతో ఆ ఇష్యూ కాస్త సద్దుమణిగింది. ఇక కేరళ బెస్ట్ సినిమాలతో మెరుపులు మెరిపిస్తుంది అనుకుంటే మళ్లీ కాంట్రవర్సీలో చిక్కేలా చేశారు యాక్టర్లు.
Also Read : Tollywood : మే 9పై కర్చీఫ్ వేసేసిన శ్రీవిష్ణు, సమంత.. హరిహర వీరమల్లు డౌటే.?
Also Read
- Yash: రాకింగ్ స్టార్ యష్‌తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
- Toxic: 'టాక్సిక్' నుంచి మరో సర్ప్రైజ్.. యష్‌తో ఈసారి తారా సుతారియా రొమాన్స్!
- PV Sindhu: రాజమౌళి సినిమాలో నటిస్తా.. పీవీ సింధు ట్వీట్ వైరల్, హీరోయిన్ ఛాన్స్ అడిగిన స్టార్ షట్లర్!
- Paraak Movie: KGFతర్వాత మరో సంచలనం..! 'పరాక్' టీజర్‌తో పాన్ ఇండియా హైప్.. శ్రీమురళి యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా
సినిమాలతో కన్నా ఎప్పుడూ ఏదో ఓ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాతో పాటు సినీ సర్కిల్స్‌లో రోస్టింగ్‌కు గురౌతుంటారు షైన్ టామ్ చాకో. గతంలో ఓసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బయటపడ్డ ఈ దసరా విలన్ మళ్లీ ఇప్పుడు చిక్కాడు. కొచ్చిలో ఓ హోటల్‌పై నార్కోటిక్ అధికారులు రైడ్ చేయగా అక్కడ నుండి తప్పించుకున్నాడు. ఈ ఇష్యూలో ఎంటర్ అవ్వగానే తనను డ్రగ్స్ తీసుకుని వేధించాడంటూ బాంబు పేల్చింది ఓ కో యాక్ట్రెస్. కేస్ విత్ డ్రా కూడా చేసుకుంది కానీ ప్రజెంట్ ఇది నేషనల్ ఇష్యూగా మారిపోయింది. షైన్ టామ్ చాకోపై డ్రగ్స్, సెక్యువల్ హెర్రాస్ మెంట్ అలిగేషన్స్ వచ్చాయో లేదో మంజుమ్మల్ బాయ్స్ యాక్టర్ శ్రీనాథ్ బాసిపై ఆరోపణలు చేశాడు నిర్మాత హసీబ్ మలబార్. శ్రీనాథ్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని, సీయు ఇన్ కోర్ట్ మూవీ షూటింగ్ సమయంలో తననే డ్రగ్స్ డిమాండ్ చేశాడంటూ కామెంట్స్ చేశాడు. దీని వల్ల షూటింగ్, డబ్బింగ్ డిలే అయ్యిందంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత. ఇప్పుడు ఈ తీవ్ర ఆరోపణలు మల్లూవుడ్‌లో కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇద్దరు యాక్టర్లు.. అందులోనూ రేసింగ్ అవుతున్న టైంలో ఇలాంటి ఆరోపణలతో.. మొత్తం కేరళ ఇండస్ట్రీ గురించి చర్చించేలా చేస్తోంది. మరీ ఈ డ్రగ్స్ ఇష్యూ ఎంతవరకు వెళుతుందో..? ఎందరి పేర్లు బయటకు వస్తాయో.
తాజావార్తలు
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
-
Yash: రాకింగ్ స్టార్ యష్‌తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
-
Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
-
Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
-
India First Dengue Vaccine: శుభవార్త.. భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!