Comedian Ali: కమెడియన్ అలీ, హీరో పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుభందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి సినిమా దగ్గరనుంచి వీరిద్దరి ఆమధ్య స్నేహ బంధం కొనసాగుతోంది.. పవన్ సినిమా అంటే అలీ ఉండాల్సిందే. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చాకా వీరి మధ్య విబేధాలు తలెత్తాయని, ప్రస్తుతం వీరిద్దరి మధ్య మాటలు లేవని ఎన్నోరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ జనసేనలో చేరకుండా అలీ వైసీపీ లో చేరడం, పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడడంతో పవన్ అభిమానులు సైతం అలీకి వ్యతిరేకంగా మారారు.
ఇక గత కొన్నిరోజుల నుంచి వైసీపీలో నుంచి అలీ బయటికి వచ్చారని, త్వరలోనే జనసేనలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్నేహితుడు వస్తాను అంటే పవన్ వెంటనే ఒప్పుకుంటారని, ఆయనకు మంచి పదవిని కూడా ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు.అయితే ఈ విషయమై అలీ స్పందించాడు. ఎవడు చెప్పాడు.. అంటూ తనదైన స్టైల్లో సమాధానం చెప్పుకొచ్చాడు. ఆ వార్తలో నిజం లేదని, తాను జనసేనలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం అలీ వరుస సినిమాలతో బిజీగా మారడమే కాకుండా ఒక సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.