Site icon NTV Telugu

Click Shankar: క్లిక్ శంకర్ గా మారిన ‘దేవర’ విలన్..

Click

Click

Click Shankar: బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ గురించి తెలుగువారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆదిపురుష్ లో రావణుడిగా కనిపించిన తరువాత సైఫ్ అందరికి సుపరిచితుడుగా మారిపోయాడు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ కు ధీటుగా విలనిజాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు. ఒక పక్క విలన్ గా నటిస్తూనే.. ఇంకోపక్క హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సైఫ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం క్లిక్ శంకర్. ధనుష్ కు మారి లాంటి హిట్ సినిమాను అందించిన బాలాజీ మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. స‌స్పెన్స్ -కామెడీ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ గ‌తంలో ఎన్న‌డు పోషించ‌నటి వంటి డిఫ‌రెంట్ పాత్ర పోషిస్తున్నాడుట‌. ఇందులో సైఫ్ హైపర్ థైమెసియా తో బాధపడే వ్యక్తిగా కనిపించనున్నాడని టాక్. ఇక నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

క్లిక్ శంకర్ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కన్ను.. కన్ను లోపల అంతా కెమెరా లెన్స్.. దాని మీద నడుస్తూ ఒక వ్యక్తి.. లోపల వలయాలు.. వలయాలు గా మెట్లు కనిపిస్తుండగా.. కన్ను కిందా చెట్లు.. వేర్లు.. పైన ఇల్లు చూపించారు. పోస్టర్ లోనే ఎంతో అర్ధం వచ్చేలా ఇదంతా కెమెరాకు సంబంధించిన కథగా చూపించారు. పోస్టర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా తో సైఫ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version