YVS Chowdary Comments on Movies with one Caste: అనేకమంది హీరోలను పరిచయం చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు వైవిఎస్ చౌదరి. చివరిగా సాయి ధరంతేజ్ హీరోగా రేయ్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా చేసి చాలా కాలమే అయింది. తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు. కొన్నాళ్ల క్రితం నందమూరి జానకిరామ్ కొడుకు నందమూరి తారకరామారావుని హీరోగా అనౌన్స్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది. అయితే ఈరోజు ఈ సినిమాలో హీరోయిన్ పేరు అనౌన్స్ చేసేందుకు మరో ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ ప్రెస్ మీట్ లో మీరు ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలతో సినిమాలు చేస్తారని వాదన వినిపిస్తోంది.
YVS Chowdary: వైవీఎస్ చౌదరి – నందమూరి తారక రామారావు సినిమాకి ఆస్కార్ గ్రహీతలు
దానిపై మీరు ఎలా స్పందిస్తారు అనే ప్రశ్న ఎదురైంది. దానికి వైవిఎస్ చౌదరి స్పందిస్తూ అదేమీ లేదని తాను ఎప్పుడూ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని సినిమాలు చేయలేదని చెప్పుకొచ్చాడు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో హరికృష్ణ గారు ఒక హీరో అయితే సుమన్, వెంకట్ వంటి వాళ్లు మిగతా హీరోలుగా నటించారని వాళ్ళది ఏ కులం అని ప్రశ్నించారు. అలాగే సాయి ధరంతేజ్ ది కూడా మీరు అనుకుంటున్నా సామాజిక వర్గం కాదు కదా అని ఎదురు ప్రశ్నించారు వైవిఎస్ చౌదరి. ఇక ఈ కొత్త సినిమాని తన భార్య గీత ఎలమంచిలి నిర్మాతగా వ్యవహరించబోతున్నారని ఆమెకు ఉన్న ఎన్నారై ఫ్రెండ్స్ సినిమా నిర్మిస్తుంటే ఆమె వాళ్ళ అందరి తరపున ప్రతినిధిగా నిర్మాతగా వ్యవహరించబోతుందని చెప్పుకొచ్చారు.