సరైనా హిట్స్ లేక కెరీర్‌లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్ట్రాంగ్ కంటెంట్లపై ఫోకస్ చేస్తున్నాడు. హిస్టారికల్ జోనర్లపై కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన స్కై ఫోర్స్ మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు మరో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేసరి సీక్వెల్‌గా కేసరి 2ను తీసుకురాబోతున్నాడు. జలియన్ వాలా భాగ్ మారణకాండ తర్వాత బాధితుల తరుఫున పోరాటం చేసే అడ్వకేట్ శంకరన్ నాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు అక్షయ్.
Also Read : Mouny Roy : మౌని రాయ్.. ఒంపులు.. సొంపులు.. అదిరాయ్..
విలన్స్ రోల్స్‌కు షిఫ్టైన సంజయ్ దత్ ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోగానూ తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ అండ్ ఫిక్షన్ డ్రామాతో కాకుండా బాలీవుడ్ ట్రెండీ జోనర్ హారర్ కామెడీతో ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ది భూత్నీ’లో దెయ్యాలను అంతమొందించే బాబాగా కనిపించబోతున్నాడు నాగినితో ఫేం తెచ్చుకున్న మౌనిరాయ్ నెగిటివ్ రోల్ పోషిస్తుంది. బాడీ డబుల్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశారు సంజు. సిద్దాంత్ సచ్ దేవ్ దర్శకుడు. కేసరి 2, ది భూత్నీ ఏప్రిల్ 18నే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఐపీఎల్ ఫీవర్ ఉన్నా కూడా రిస్క్ చేసి సినిమాలను దింపుతున్నాయి. ఇప్పటికే కేసరి 2 టీజర్, ట్రైలర్స్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటున్నాయి. అక్షయ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటూ వార్తలొస్తున్నాయి. అలాగే లాస్ట్ ఇయర్ సక్సెస్ మంత్రగా మారిన హారర్ కామెడీ భూత్నీ ట్రైలర్ కూడా ఓకే అనిపించుకుంది. ట్రైలర్లతో సినిమాను డిసైడ్ చేయడం కష్టం కాబట్టి.. అక్షయ్ కుమార్, సంజు మధ్య బిగ్ ఫైట్ జరగబోతున్నట్లే. మరీ ఈ ఇద్దరిలో గెలిచేదెవరోమరికొద్ది రోజుల్లో తేలనుంది.